Telugu News » భోళా..వింటేజ్ వీరయ్యకు డబుల్ ఉంటాడట..! రివ్య్యూ ఎవరిచ్చారంటే..!?

భోళా..వింటేజ్ వీరయ్యకు డబుల్ ఉంటాడట..! రివ్య్యూ ఎవరిచ్చారంటే..!?

by sai krishna

ఇన్ ఫ్రంటాఫ్ దేర్ ఈజ్ క్రోకొడైల్ ఫెస్టివల్ అంటున్నాడు మన ‘భోళా శంకర్’.ఈ సారి వాల్తేర్ వీరయ్యను మించి అన్నయ్య అలరిస్తాడంట.ఈ సినిమా తీసినోళ్ల మాటకాదు.సినిమా చూసినోళ్ల మాట.

రిలీజే కాలేదు టాక్ ఎలా వచ్చిందనుకుంటున్నారా…! ఇది సెన్సార్ బోర్డు నుంచి వచ్చిన చిన్న లీకేజ్ న్యూస్.చిరు 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా వచ్చి సాలిడ్ హిట్ కొట్టాడు. ఆచార్య డిజాస్టర్ ని మరిపించేందుకు “గాడ్ ఫాదర్’’ ఫాదర్ తో కవర్ చెయ్యాలని చూశాడు.

కానీ గాడ్ ఫాదర్ కమర్షియల్ గా గుడ్ ఫాదర్ కాలేకపోయాడు. ఆ తర్వాత వాల్తేర్ వీరయ్యగా వింటేజ్ చిరంజీవి సంక్రాంతి తెరమీదకు వచ్చి, యాక్షన్ , సెంటిమెంట్, కామెడీ ఇరగదీశాడు.

అయితే లేటెస్ట్ లీకేజ్ టాక్ ఏంటంటే..మరో వారం రోజుల్లో రాబోతున్న భోళాశంకర్ మూవీ ‘వాల్తేర్ వీరయ్య’ను మించి ఉంటుందట. వింటేజ్ చిరూని మెగా ఫ్యాన్స్ కి స్క్రీన్ గిఫ్ట్ ఇస్తుందట.

ఇక డైరెక్టర్ మెహర్ రమేశ్ కూడా మెగా డైహార్ట్ ఫ్యాన్ కావడం, అతను టచ్ చేసిన సినిమాలు హిట్టనేది చూడకపోవడంతో..ఈ సారి గట్టి హిట్టు ఇస్తాడనేది ప్రధానాంశంగాను..అంతకు మించిన సస్పెన్సుగానూ మారింది.

మొన్నటి వరకు స్లోగా, కాస్త చప్పగా సాగిన భోళా శంకర్ ప్రమోషన్స్ కి సాలిడ్ కిక్ ఇచ్చింది లేటెస్ట్ ట్రైలర్. ఈ ట్రైలర్ భోళా శంకర్ సినిమాపై అంచనాలను బాగా పెంచేసింది.

ఇప్పుడు సినిమా చూసిన సెన్సార్ బోర్డువా రిపోర్ట్ ప్రకారం భోళాశంకర్ బ్రహ్మాండమని, వాల్తేరు వీరయ్య కన్నా ఎంటర్టైనింగ్ గా ఉండబోతుందని సమాచారం.

వింటేజ్ ఎలిమెంట్స్ తో దంచికొడుతుందట. ముఖ్యంగా చిరు చూపించిన పవన్ మ్యానరిజమ్స్ థియేటర్స్ లో నవ్వులు పూయిస్తాయట. సెన్సార్ రిపోర్ట్ నిజమై భోళా శంకర్ సినిమా హిట్ తెచ్చుకుంటే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవ్వడం పక్కా.

ఇప్పటికే బ్రో సినిమాతో మంచి జోష్ లోకి వచ్చిన ఫాన్స్, అదే జోష్ లో భోళా శంకర్ కోసం థియేటర్స్ కి వస్తారు. ఆ మూమెంటమ్ ని క్యారీ చేసేలా భోళా శంకర్ సినిమా ఉంటే చాలు మెహర్ ఖాతాలో మంచి హిట్ పడినట్లే.!

You may also like

Leave a Comment