Telugu News » Military Strength Ranking: ప్రపంచ దేశాల ఆర్మీ ర్యాంకింగ్‌లు విడుదల.. భారత్‌ స్థానం ఎంతంటే..?

Military Strength Ranking: ప్రపంచ దేశాల ఆర్మీ ర్యాంకింగ్‌లు విడుదల.. భారత్‌ స్థానం ఎంతంటే..?

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీని కలిగి ఉన్న టాప్ 10దేశాల జాబితా తాజాగా విడుదలైంది. ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా తొలి స్థానం దక్కించుకుంది. ఇక భారత్‌ నాలుగోస్థానంలో నిలవడం విశేషం.

by Mano
Military Strength Ranking: Army rankings of world countries released.. What is India's position..?

దేశాన్ని శత్రు సైన్యం, ఉగ్రవాదుల  నుంచి కాపాడుకోవడంలో ఆర్మీ ఎంతో కీలకమైనది. ప్రపంచంలో ఏ దేశానికైనా మిలిటరీ పవర్‌ (Military Strength) చాలా ముఖ్యం. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా మిలిటరీ ముందుంటుంది. ఇందుకోసం అన్ని దేశాలు తమ ఆర్మీ పవర్‌ను పెంచుకునేందుకు ఆసక్తి చూపుతాయి.

Military Strength Ranking: Army rankings of world countries released.. What is India's position..?

అయితే, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలిటరీని కలిగి ఉన్న టాప్ 10దేశాల జాబితా తాజాగా విడుదలైంది. ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా తొలి స్థానం దక్కించుకుంది. ఇక భారత్‌ నాలుగోస్థానంలో నిలవడం విశేషం. గ్లోబల్ ఫైర్ పవర్స్ (Global Firepower) మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకింగ్స్-2024 పేరుతో ఓ రిపోర్ట్‌ను రిలీజ్‌ చేసింది. మొత్తం 145 దేశాల సైనిక శక్తి సామర్థ్యాలను ర్యాంక్‌లుగా మార్చి రిలీజ్ చేసింది.

సైనికుల సంఖ్య, ఆయుధాలు, ఆర్థిక సుస్థిరత, భౌగోళిక పరిస్థితి, వనరులు ఇలా మొత్తం 60కి పైగా అంశాలను పరిగణలోకి తీసుకుని ర్యాంకులను కేటాయించింది. ఈ జాబితాలో రెండో స్థానంలో రష్యా, మూడో స్థానంలో చైనా దేశాలు నిలిచాయి. ఇక ఈ జాబితాలో అత్యంత శక్తివంతమైన మిలిటరీ కలిగిన దేశంగా భారత్‌ నాలుగో స్థానంలో నిలవడం విశేషం. పాకిస్తాన్ తొమ్మిదో స్థానంలో ఉంది.

సౌత్ కొరియా, యూకే, జపాన్, తుర్కియే, ఇటలీ మిగతా స్థానాల్లో ఉన్నాయి. ఇక ప్రపంచంలోనే మిలిటరీ శక్తి బలహీనంగా ఉన్న దేశాల జాబితాను కూడా గ్లోబల్‌ ఫైర్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో భూటాన్‌ తొలి స్థానంలో నిలిచింది. సూరినామ్, మాల్డోవా, బెలిజ్, సియెర్రా లియోన్,  సోమాలియా, బెనిన్, లైబీరియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఐలాండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

You may also like

Leave a Comment