Telugu News » MLC Kavitha : బీఆర్ఎస్ పాలనలో ఆడబిడ్డలకు అన్యాయం జరగలేదు.. ఎమ్మెల్సీ కవిత !

MLC Kavitha : బీఆర్ఎస్ పాలనలో ఆడబిడ్డలకు అన్యాయం జరగలేదు.. ఎమ్మెల్సీ కవిత !

ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి మహిళల ఉద్యోగాల విషయంలో కోత విధించారని విమర్శించారు.. గతంలో వ్యక్తిగతంగా చనిపోయిన ఆడబిడ్డలను అడ్డుపెట్టుకుని రేవంత్‌ రెడ్డి రాజకీయం చేశారని ఆరోపించారు.

by Venu
mlc kavitha said that local body elections should be held only after the caste census

కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం పై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మండిపడ్డారు.. అంతర్జాతీయ మహిళా దినోత్సం రోజు ధర్నా చేయాల్సి రావడం సిగ్గుచేటని విమర్శించారు. ఉమెన్స్‌ డే (Women’s Day) రోజున సంతోషంగా సంబురాలు చేసుకునే ఆడ‌బిడ్డలు ఉద్యోగాల‌కై ధ‌ర్నాలు చేసే దౌర్భాగ్యపు స్థితిని ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆరోపించారు.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల విషయంలో మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Mlc Kavitha: Govt should reconsider that decision: Mlc Kavithaప్రభుత్వ నియామకాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా హైదరాబాద్‌ (Hyderabad) ధర్నా చౌక్‌లో ఎమ్మెల్సీ కవిత దీక్షకు చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ మహిళలకు అనేక హక్కులు కల్పించారని తెలిపారు. తెలంగాణ (Telangana) వచ్చిన తర్వాత 33 శాతం రిజర్వేన్‌ను పెంచుకున్నామని, కేసీఆర్‌ (KCR) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షకుపైగా ఉద్యోగాలు కల్పించుకున్నామని వెల్లడించారు..

ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి మహిళల ఉద్యోగాల విషయంలో కోత విధించారని విమర్శించారు.. గతంలో వ్యక్తిగతంగా చనిపోయిన ఆడబిడ్డలను అడ్డుపెట్టుకుని రేవంత్‌ రెడ్డి రాజకీయం చేశారని ఆరోపించారు. వికలాంగులు, మహిళలకు తోడు ఉండకుండా ఎవరికి తోడు ఉంటున్నారో చెప్పాలని డిమాండ్ కవిత చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ పాలనలో ఆడబిడ్డలకు అన్యాయం జరగలేదని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆడపిల్లలకు వ్యతిరేకంగా జీవో 3 తెచ్చిందని విమర్శించారు. ఈ జీవో వల్ల ఉద్యోగాల్లో అమ్మాయిలకు అన్యాయం జరుగుతుందని వివరించారు. వెంటనే ప్రభుత్వం ఈ జీవోను రద్దుచేసి, హైకోర్టులు పిటిషన్‌ వేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్‌ గాంధీ విగ్రహం పెడుతున్నారని కవిత మండిపడ్డారు..

You may also like

Leave a Comment