Telugu News » Need mother feed: “అమ్మా” ఆలోచించు…నీపాలే బిడ్డ ఆరోగ్యానికి మేలు..!

Need mother feed: “అమ్మా” ఆలోచించు…నీపాలే బిడ్డ ఆరోగ్యానికి మేలు..!

బిడ్డకు జన్మిచ్చిన అమ్మ మరోజన్మ ఎత్తినట్టే అంటారు.కనడంతోనే అమ్మబాధ్యత తీరిపోదు, ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడాలి.

by sai krishna

బిడ్డకు జన్మిచ్చిన అమ్మ మరోజన్మ ఎత్తినట్టే అంటారు. నిజానికి ప్రాణాలు పణంగా పెట్టి బిడ్డను కనడంతోనే ఆరోగ్య పరంగా అమ్మ పని అయిపోతుంది. కానీ కనడంతోనే అమ్మబాధ్యత తీరిపోదు, ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడాలి.

బిడ్డకోసం, వాడి ఆరోగ్యం కోసం అమ్మే ఆహారంగా మారాలి. తన పాలిచ్చి పెంచాలి. ఆడది అమ్మ స్థానంలోకి వెళ్లగానే బిడ్డ ఏడుపు వినగానే తన స్థనాల్లోంచి అప్రయత్నంగా ఉబికివచ్చే పాలతో బిడ్డ ఆకలి తీర్చి అమ్మ తరించిపోతుంది.

ప్రతి తల్లిలోనూ జరిగే సహజ ప్రక్రియ. కానీ ఈనాటి అమ్మ బిడ్డను కని..బిడ్డకోసమే పుట్టిన తన పాల ను ఇవ్వడానికి ఆలోచిస్తోంది. బిడ్డ భవిష్యత్తు కన్నా తన అందమే మిన్నగా భావిస్తోంది. కానీ అమ్మా ఒక సారి ఆలోచించు బిడ్డకు తల్లిపాలు(feeding) చాలా మేలు చేస్తాయంటున్నారు వైద్య నిపుణులు.

 

కారణాలు ఏవైనా తల్లి పాలు నోచుకోని పిల్లలు వారి భవిష్యత్తులో ఆరోగ్య పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. ప్రతి ఒక్క బిడ్డకు ఆరు నెలలు వచ్చేవరకు తల్లిపాలు కచ్చితంగా అవసరం.

ఈ ఆరు నెలలు తల్లిపాలు తప్ప మరొకటి ఇవ్వద్దంటున్నారు. తల్లిపాల గొప్పతనం గురించి పరిశోధనలో మరో గొప్ప సంగతి బయటపడింది. తల్లిపాలలో మేయో-ఇనాసిటోల్(Mayo-inasitol)అనే చక్కెర పుష్కలంగా ఉంటుంది.ఇది నవజాత శిశువుల మెదడు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని టిప్స్ యూనివర్సిటీ(TIPS University) శాస్త్రవేత్తలు గుర్తించారు.

పుట్టినప్పటినుండే మెదడులోని అనుసంధానాలు ఏర్పడుతుంటాయి అంతేకాదు మెరుగుపడుతూ వస్తుంటాయి కూడా. దీనివల్ల జన్యు పరమైన అంశాలతో పాటు, జీవితంలో ఎదురయ్యే ఎన్నో అనుభవాలుకు దారి చూపుతుంటాయి. తల్లిపాలతో శిశువులకు సూక్ష్మ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

శిశువులలో వివిధ దశలో మెదడు ఎదుగుదలను బట్టి తల్లి పాలలోని పోషకాల మోతాదులు మారిపోతుంటాయి. ఇది మరింత ఆశ్చర్యకరం. శిశువుకి జన్మనిచ్చిన తర్వాత తొలి నెలల్లో తల్లిపాలలో పెద్ద మొత్తంలో మేయో-ఇనాసిటాల్ ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ సమయంలోనే సినాప్సెస్ అంటే శిశువుల మెదడులో నాడి అనుసంధానాలు చాలావేగంగా ఏర్పడతాయి. మేయో – ఇనాసిటోల్ శిశువుల నాడుల మధ్య ఉన్న అనుసంధానాల పరిమాణం పెరగడానికి దానికి తోడు వాటి సంఖ్య పెరగడానికి తోడ్పడుతుంది.

శిశువు పుట్టిన తొలినాళ్లు రక్తంలోని హాని కలిగించేవి మెదడులోకి చేరకుండా అడ్డుకునే బ్యాక్టీరియా(Bacteria)అంత సమర్థంగా పనిచేయదు. దీనివల్ల శిశువు మెదడు ఆహారానికి చాలా ఎక్కువగా స్పందిస్తుండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

You may also like

Leave a Comment