మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే వరుణ్ తేజ్(Varun Tej,లావణ్య త్రిపాఠీలు అఫీషియల్ గా ఒక్కటయ్యేందుకు పెళ్లి ముహూర్తం ముంచుకొస్తోంది.
ఇది వరకే ఇద్దరికీ ఎంగేజ్ మెంట్(Engagement)ఘనంగా జరిగింది. మరి కొద్ది రోజుల్లో ఈ ప్రేమ జంట పెళ్లి సందడిలోకి అడుగుపెట్టబోతోంది.అయితే వీరి పెళ్లి ఎప్పుడనే దానిపై రోజుకోవార్త తెరమీదికి వస్తోంది.
అయితే లేటెస్ట్ పెళ్లి కబురేంటంటే..తమ ప్రేమ చిగురించిన చోటు ఇటలీలోనే పెళ్లి కూడా జరగనుందని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. నవంబరు నెలలో ఈ పెళ్లి జరగనుందని తెలిసింది.
నవంబర్ 1వ తేదీని లాక్ చేసినట్లు సమాచారం. ఇరు కుటుంబల సమక్షంలో మూడు రోజుల పాటు డెస్టినేషన్ వెడ్డింగ్ (destination wedding)పద్ధతిలో జరగనున్నట్లు సమాచారం అందింది.
ఈ వేడుక కోసం మెగా ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్లనున్నారట. కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్( Pawan Kalyan)మాత్రం ఒక్కరే బిజీ షెడ్యూల్ కారణంగా హాజరుకాకపోవచ్చని వినికిడి. వరుణ్ విషయానికొస్తే ప్రస్తుతం గాండీవధారి అర్జున అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో బిజీగా ఉన్నారు.
ఈ చిత్రం మరో మూడు రోజుల్లో ఆగస్ట్ 25న గ్రాండ్‌గా విడుదల కానుంది. స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. సినిమాలో వరుణ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.
దాదాపు రూ.50కోట్ల బడ్జెట్‌తో సినిమాను రూపొందించారని తెలిసింది. ఈ చిత్రం హిట్ కావడం అటు ప్రవీణ్ సత్తారు ఇటు వరుణ్ తేజ్‌కు ఎంతో ముఖ్యం.