Telugu News » గుంటూరు కారంతో పాటు ఓటిటిలో రిలీజ్ కానున్న 23 సినిమాలు.. ఈ 6 మాత్రం అస్సలు మిస్ కావద్దు!

గుంటూరు కారంతో పాటు ఓటిటిలో రిలీజ్ కానున్న 23 సినిమాలు.. ఈ 6 మాత్రం అస్సలు మిస్ కావద్దు!

ఈ వారం ఓటిటిలో రిలీజ్ కానున్న 23 సినిమాలు!

by Sri Lakshmi

ఇటీవల సినిమా థియేటర్లలో రిలీజ్ అయినా కొన్ని రోజులకే ఓటిటిలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో సినిమా చూడడం మిస్ అయిన వారు ఓటిటిలో చూడడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే.. ప్రతి వారం సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. కొన్ని థియేటర్లలో రిలీజ్ అయితే.. కొన్ని ఓటిటిలో రిలీజ్ అయ్యి సందడి చేస్తాయి. కానీ, ఈ వారం మాత్రం సినిమా రిలీజ్ లు కొంత ఎక్కువే ఉన్నాయి. ఈ వారం మొత్తంగా 23 సినిమాలు ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి.

రవితేజ ఈగల్ సినిమా థియేటర్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు.. ఓటిటిలో కూడా సినిమాలు సందడి చేస్తున్నాయి. మొత్తం 23 సినిమాలు, సిరీస్ లలో ఓ ఆరు మాత్రం చాలా ఎక్సయిట్మెంట్ ను క్రియేట్ చేసాయి. వాటిలో ఒకటి మహేష్ గుంటూరు కారం సినిమా. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించారు. ఇంకా, లవర్స్ డే స్పెషల్ గా సుమ కొడుకు నటించిన బబుల్ గమ్ సినిమా ఆహ ఓటిటిలో రిలీజ్ అవుతోంది.

కన్నడ స్టార్‌ దర్శన “కాటేరా”, ధనుష్ “కెప్టెన్ మిల్లర్” సినిమాలు కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. సుస్మితా సేన్ ఆర్య-3 , భూమి పడ్నేకర్ “భక్షక” వెబ్ సిరీస్ ల కోసం కూడా నెటిజన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవి కాకుండా మొత్తంగా ఓటిటిలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ ఇక్కడ చూసేయండి.

నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలు:
1. డీ అండ్ ఫ్రెండ్స్ ఇన్ ఓజ్- ఫిబ్రవరి 05
2. ఆక్వామాన్ అండ్ ది లిస్ట్ కింగ్‌డమ్ – ఫిబ్రవరి 05
3. మాంక్ సీజన్స్ – ఫిబ్రవరి 05
4. మై వైఫ్ అండ్ కిడ్స్ సీజన్స్ -ఫిబ్రవరి 05
5. ది రీ-ఎడ్యుకేషన్ ఆఫ్ మోలీ సింగర్ -ఫిబ్రవరి 05
6. లూజ్: ది లైట్ ఆఫ్ హార్ట్ – ఫిబ్రవరి 07
7. రైల్: ది లాస్ట్ ప్రొఫెట్ – ఫిబ్రవరి 07
8. లవ్ నెవర్ లైస్ పోలాండ్- సీజన్ 2 -పార్ట్ 2 -ఫిబ్రవరి 07
9. వన్ డే (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 08
10. గుంటూరు కారం(తెలుగు)- ఫిబ్రవరి 09
11. భక్షక్-(హిందీ క్రైమ్ థ్రిల్లర్‌ )- ఫిబ్రవరి 09
12. లవర్ స్టాకర్ కిల్లర్ – ఫిబ్రవరి 09
13. యాషెస్ ( టర్కీ సిరీస్)- ఫిబ్రవరి 09
14. ఎ కిల్లర్ పారడాక్స్ (కొరియన్ సిరీస్)- ఫిబ్రవరి 09న స్ట్రీమింగ్ 15. ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 (స్పానిష్ సిరీస్)- ఫిబ్రవరి 09
16. హారిబుల్ బాసెస్ – ఫిబ్రవరి 10
17. బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11

అమెజాన్ ప్రైమ్:
18. కెప్టెన్ మిల్లర్ (తెలుగు) ఫిబ్రవరి 09

ఆహ:
19. బబుల్ గమ్ (తెలుగు) ఫిబ్రవరి 09

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
20. ఆర్య వెబ్ సిరీస్ – ఫిబ్రవరి 09

జీ 5:
21. కాటేరా కన్నడ మూవీ – ఫిబ్రవరి 09
22. లాంత్రాని హిందీ మూవీ – ఫిబ్రవరి 09

బుక్ మై షోలో:
ఆక్వా మాన్ అండ్ ది లాస్ట్ కింగ్ డమ్ – ఫిబ్రవరి 05

You may also like

Leave a Comment