Telugu News » Nayanthara: నయన్‌ సినిమాపై వివాదం.. ‘అన్నపూరణి’ స్ట్రీమింగ్‌ నిలిపివేత..!

Nayanthara: నయన్‌ సినిమాపై వివాదం.. ‘అన్నపూరణి’ స్ట్రీమింగ్‌ నిలిపివేత..!

‘అన్నపూరణి’ సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపివేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌(Netflix) ప్రకటించింది. దీనికి కారణం ఈ చిత్రం శ్రీరాముడిని కించపరిచేలా ఉందంటూ ముంబయి పోలీసులకు ఫిర్యాదు అందింది.

by Mano
Nayanthara: Controversy over Nayan's movie.. 'Annapurani' streaming stopped..!

లేడీ సూపర్‌ స్టార్‌(Lady Super Star) నయనతార (Nayanthara) తాజాగా నటించిన చిత్రం ‘అన్నపూరణి’(Annapurani). నయన్‌ కెరీర్‌లో 75వ సినిమాగా వచ్చిన ఈ చిత్రానికి నీలేష్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. డిసెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయినా ఓటీటీ(OTT)లో ఆదరణ పొందింది.

Nayanthara: Controversy over Nayan's movie.. 'Annapurani' streaming stopped..!

అయితే, ఈ సినిమాపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలు చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ‘అన్నపూరణి’ సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపివేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌(Netflix) ప్రకటించింది. దీనికి కారణం ఈ చిత్రం శ్రీరాముడిని కించపరిచేలా ఉందంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు అందింది.

శ్రీరాముడు మాంసాహారి అని, ఇది వాల్మీకి అయోధ్య కాండలో ఉందంటూ ఈ సినిమాలో ఓ డైలాగ్‌ ఉంటుంది. ఇటీవల ఈ సినిమా చూసిన మహారాష్ట్రకు చెందిన శివసేన మాజీ నేత రమేశ్‌ సోలంకి మూవీలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం తెలుపుతూ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హీరో ముస్లిం అయి ఉండటం, హీరోయిన్‌ బ్రాహ్మణ కుటుంబానికి చెంది ఉండటంతో లవ్‌ జీహాద్‌ను ప్రోత్సహించేలా ఉందని, ఈ చిత్ర నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని రమేశ్‌ సోలంకి ఫిర్యాదులో పేర్కొన్నారు.

You may also like

Leave a Comment