పెళ్లి తర్వాత చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏదో ఒక గొడవ రావడం పెళ్ళై విడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. పెళ్లి తర్వాత కొన్ని పొరపాట్లని అస్సలు చేయకూడదు ఇటువంటి పొరపాట్లని ముఖ్యంగా భార్యలు చేసినట్లయితే భార్య భర్తల మధ్య సమస్యలు వస్తాయి. భార్యాభర్తల మధ్య సరైన కమ్యూనికేషన్ ఉండాలి చాలా మంది భార్య భర్తల మధ్య కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండడం వలన అపార్థాలకు దారి తీస్తోంది. కాబట్టి ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి.
అలానే పెళ్లయిన తర్వాత భార్య ఈ విషయాలను కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి భార్యగా తల్లిగా కోడలిగా కొత్త బాధ్యతలు నిర్వర్తించే ప్రయత్నంలో కెరియర్ ని పక్కన పెట్టకూడదు. నిజానికి ఆశయాల కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. ఫ్యామిలీ ని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ కనుక భార్య కుటుంబాన్ని అంతిమ లక్ష్యంగా పెట్టుకున్నట్లైతే నిరాశ పశ్యతాపానికి దారితీస్తుంది. సో ఎప్పుడు కూడా భార్యలు ఈ పొరపాటు చేయకుండా చూసుకోండి రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ బాగుంటుంది.
Also read:
భర్త అన్నీ అర్థం చేసుకుంటాడని నమ్మకండి కొంతమంది భార్యలు భర్త అర్థం చేసుకుంటారు కదా అని చెప్పకుండా వదిలేస్తూ ఉంటారు. ఏదైనా విషయాలని భర్తకు చెప్పకపోతే అర్థం కావు, మీ మధ్య సమస్యలు కలగవచ్చు. ఎప్పుడైనా ఏదైనా చెప్పాలనుకుంటే ఓపెన్ గా ఎక్స్ ప్రెస్ చేయండి వాళ్లే అర్థం చేసుకుంటారు కదా అని వదిలేస్తే ఇబ్బంది పడాలి. పైగా అర్థం చేసుకోలేదని చాలామంది భర్తతో గొడవ పడడం వంటివి చేస్తూ ఉంటారు ఓపెన్ గా కమ్యూనికేట్ చేయడం వలన సమస్యలు తగ్గిపోతాయి