Telugu News » Sai Pallavi: ఎక్కడున్నా.. గౌరవంగా ఉండాలి: నేచురల్‌ బ్యూటీ

Sai Pallavi: ఎక్కడున్నా.. గౌరవంగా ఉండాలి: నేచురల్‌ బ్యూటీ

ఇటీవల సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌పై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను ఇష్టం లేకుండా ఏ పనీ చేయలేదని సాయిపల్లవి మరోసారి స్పష్టం చేసింది.

by Mano
Sai Pallavi: Wherever you are.. should be respected: natural beauty

కథలు, పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వస్తాయి. మనసుల్ని కట్టిపడేసే ఆకర్షణ ఆమె సొంతం. నిజానికి ఆమెకున్న క్రేజ్‌ దక్షిణాదిన(South India) ఏ హీరోయిన్‌కీ లేదు. కథల ఎంపికలో జాగ్రత్త పడుతూ తనకు నచ్చిన కథలనే ఎంచుకుంటూ ఇప్పుడున్న హీరోయిన్లలో మంచి పేరు తెచ్చుకుంది హీరోయిన్ సాయిపల్లవి(Sai Pallavi).

Sai Pallavi: Wherever you are.. should be respected: natural beauty

హీరోయిన్ అయి తొమ్మిదేళ్లు అవుతున్నా ఆమె చేసిన సినిమాలు వేళ్లల్లో లెక్కబెట్టొచ్చు. అయినా ఈమె క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇటీవల సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌పై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను ఇష్టం లేకుండా ఏ పనీ చేయలేదని సాయిపల్లవి మరోసారి స్పష్టం చేసింది.

ఎంబీబీఎస్‌ ఇష్టంతోనే చదివానని అదేవిధంగా యాక్టింగ్, డాన్స్ అన్నీ ఇష్టంతోనే నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. ఇష్టం లేకుండా తన జీవితంలో ఏదీ జరగలేదని తెలిపింది. ఇక తనకు వస్తున్న క్రేజ్ గురించి మాట్లాడుతూ అది దేవుడిచ్చిన బహుమతిగా పేర్కొంది సాయిపల్లవి.

‘ప్రేమమ్‌’ సినిమా వచ్చే వరకూ తన గురించి తనకే తెలియదని, ఇంట్లోవాళ్లు కూడా ఆశ్చర్యపోయారని తెలిపింది. ‘జీవితం ఎటు తీసుకెళ్తే అటు వెళ్లడమే మన పని అని డాడీ చెప్పారు. కాకపోతే ఎక్కడున్నా.. ఎలా ఉన్నా గౌరవంగా ఉండాలి.. గౌరవంగానే బతకాలి.. గౌరవంగానే వెళ్లిపోవాలి..’ ప్రేమమ్‌కి సైన్‌ చేస్తున్నప్పుడు నాన్న నాకు చెప్పిన నీతి అదే.. ఆ మాటలు జీవితంలో మరిచిపోను.’ అంటూ సాయిపల్లవి ఎమోషనల్ అయింది.

You may also like

Leave a Comment