ఎన్టీఆర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అటు రాజకీయాల్లో ఇది సినిమాల్లో కూడా రాణిస్తూ అందర్నీ ఆకట్టుకున్నారు అప్పట్లో తెలుగు సినిమా అంటే ఎన్టీఆర్ ఏఎన్నార్. చాలామంది నటులు ఉండేవారు. కానీ వీళ్ళిద్దరూ ప్రత్యేకము. ఎన్టీఆర్ కంటే అక్కినేని ముందు వచ్చినా సరే ఇద్దరు సినీ పరిశ్రమలో ఒకే విధంగా ప్రభావాన్ని చూపించారు. ఎటువంటి పాత్రలు చేయడానికి అయినా సరే వెనకడుకు వేసేవారు కాదు. అప్పట్లో వీళ్ళకి పోటీ కూడా ఉండేది కాదు. ఎన్టీఆర్ ఏఎన్నార్ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు కూడా.
ఎన్టీఆర్ కూడా ఏఎన్ఆర్ తో కలిసి సినిమా చేయడానికి ఆసక్తి చూపించేవారు కానీ అనుకోకుండా ఈ హీరోల మధ్య గ్యాప్ వచ్చింది. ఎన్టీఆర్ కావాలని ఏఎన్ఆర్ని దూరం పెట్టేశారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయాన్ని సీనియర్ రచయిత కృష్ణకుమారి ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎన్టీఆర్ ఏఎన్నార్ మధ్య సినీ పరిశ్రమంలో ఉన్న కొందరు వలన వాళ్ల మధ్య గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసి పోయారు ఎన్టీఆర్ విషయాలు తెలుసుకోవడానికి ఎన్టీఆర్ తో నటించడానికి ఏఎన్ఆర్ ఎంతో ఆసక్తి చూపించేవారని రచయిత కృష్ణకుమారి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.
Also read:
ఏఎన్ఆర్ ఇంట్లో ఉన్న టైంలో ఎన్టీఆర్ దగ్గర నుండి ఫోన్ కాల్ వచ్చిందని ఆ టైంలో ఏఎన్ఆర్ ఎంతో భావాద్వేగానికి గురయ్యారని చెప్పారు. ఎన్టీఆర్ నేను నిన్ను ఒకసారి చూడాలనుకుంటున్నానని నీతో నా మనసులో మాటలు చాలా చెప్పుకోవాలి ఉందని ఒకసారి ఇంటికి రమ్మని ఎన్టీఆర్ అడిగారట ఏంటి బ్రదర్ అలా అంటున్నారు ఈ మధ్యనే కదా ఇంటికి భోజనానికి వచ్చాను అని ఏఎన్ఆర్ అన్నారట. ఎన్టీఆర్ కాదు బ్రదర్ నీతో నా మనసులో బాధ చెప్పుకోవాలని అనిపిస్తుందని అన్నారట. ఫోన్ వచ్చిన మరుసటి రోజు ఎన్టీఆర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు అలా ఎన్టీఆర్ చివరగా ఏఎన్ఆర్ తో తన మనసులోని మాటలు చెప్పారని ఇంటర్వ్యూలో చెప్పారు.