Telugu News » RRR Awards : మన ‘ఆర్ఆర్ఆర్’ ఆరు నేషనల్ అవార్డ్స్ కొట్టింది..!

RRR Awards : మన ‘ఆర్ఆర్ఆర్’ ఆరు నేషనల్ అవార్డ్స్ కొట్టింది..!

తెలుగు సినిమా మరోమెట్టుకు ఎక్కింది, 69వ జాతీయ చలనచిత్ర ఉత్తమ నటుడు, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం సహా పలు అవార్డులను దక్కించుకుంది.

by sai krishna

తెలుగు సినిమా మరోమెట్టుకు ఎక్కింది, 69వ జాతీయ చలనచిత్ర ఉత్తమ నటుడు, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం సహా పలు అవార్డులను దక్కించుకుంది. వీటిలో ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ దశాదిశ మార్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఒకటి కాగా, మరో చిత్రం పుష్ప.

సరికొత్త స్టోరీ టెల్లింగ్ తో పుష్ప -1 ఇటు సౌత్ ఇండియాలోను అటు నార్త్ ఇండియాలోనూ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది.అల్లు అర్జున్ ఉత్తమ కథానాయకుడుగా దక్కించుకున్నాడు.


జాతీయ అవార్డ్ పొందిన తొలితెలుగు హీరోగా తెలుగు సినీ ప్రేక్షకుడి గుండెల్లో హీరో అయ్యాడు. తెలుగు సినిమాకి ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్(Devishri Prasad)సొంతం చేసుకున్నారు.

ఇక ఆర్ఆర్ఆర్(RRR) ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం సహా 6 అవార్డులను దక్కించుకుంది. విజనరీ డైరెక్టర్(visionary director)ఎస్.ఎస్.ఎస్ రాజమౌళి(SSS Rajamouli) తెరకెక్కించారు.

ఈ చిత్రంలో ప్రతీ ఫ్రేమ్ ని ఒక యాక్షన్ ఎమోషనల్ పెయింటింగ్ లా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల మైత్రిని తెరమీద అద్భుతంగా పండించాడు మన దర్శక ధీరుడు.


స్వాతంత్ర సమర వీరుల జీవిత కథలకు కాస్త ఆమోద యోగ్యమైన ఫిక్షన్ ని జోడించి కమర్షియల్ సినిమాటిక్ ఎక్స్పెరిమెంట్ చేసాడు.అద్భుత విజయం సాధించడంతో పాటు తెలుగు సినిమాని ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో లిఖించారు.

మన్యం వీరుడు అల్లూరిగా రామ్ చరణ్ , గోండు బెబ్బులి కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ గూస్బమ్ప్ తెప్పించారు.ముఖ్యంగా ఈ చిత్రాని సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి అద్భుత సంగీతాన్ని సమకూర్చారు.

ఈ సినిమాలోని ‘నాటు నాటు’ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలోఇటు గ్లోబర్ అవార్డ్ తో పాటు ,అటు ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్ కూడా దక్కించుకుంది. దీంతో తెలుగు సినిమా ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ మైలు రాయిగా నిలిచింది.


ఇటు తెలుగు సినిమాగానే కాకుండా అటు ఇండియన్ ఎపిక్ మూవీగా ఆర్ఆర్ఆర్( Rise Roar Revolt)”RRR” ఎంతో ప్రతిష్టను ఆర్జించింది.
రాజమౌళి దట్టించిన ఓవర్ లోడెడ్ యాక్షన్ కొరియోగ్రఫీ, విపరీతమైన స్టంట్‌వర్క్ చేశారు.

అలాగే పైరోటెక్నిక్‌లు అలాగే అత్యాధునిక కంప్యూటర్ గ్రాఫిక్స్‌ పై ఫుల్ ఫోకస్ పెట్టి నభూతో నభవిష్యతి అన్నట్టుగా తీర్చిదిద్దారు. కాగా 69 జాతీయ చలన చిత్ర అవార్డుల్లో 6 అవార్డులు దక్కించుకుంది.

కొమరం భీముడో పాటను ప్రాణం పెట్టి పాడినందుకు గాను బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్(Best playback singer) గా కాలభైరవని వరించింది , ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎమ్.ఎమ్ కీరవాణి దక్కించుకున్నారు.

బెస్ట్ మ్యూజిక్ కేటగిరీలో పుష్ప,ఆర్ఆర్ఆర్ సినిమాలకు కలిపి ఇవ్వడంతో కీరవాణి ,దేవీశ్రీతో ఈ అవార్డ్ ను షేర్ చేసుకుంటున్నారు. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ కేటగిరీలో వి.శ్రీనివాస్ మోహన్ అవార్డ్ దక్కించుకోగా అందరూ ఊహించినట్టుగానే బెస్ట్ కొరియో గ్రాఫర్(Best Choreographer) గా ప్రేమ్ రక్షిత్ అవార్డ్ కైవసం చేసుకున్నాడు.

అన్నిటికీ మించి బెస్ట్ యాక్షన్ డైరెక్టర్(Best Action Director)గా కింగ్ సోల్మెన్ అవార్డ్ గెలుచుకున్నాడు. ఈ అవార్డ్స్ సాధించినందుకు పలువురు సినీ ప్రముఖులతో పాటు,అటు రాజకీయ ప్రముఖులు సైతం ఈ చిత్రయూనిట్ ని అభినందించారు.

You may also like

Leave a Comment