బాలీవుడ్లో ఇటీవల సూపర్ హిట్‌గా నిలిచిన అమర్‌సింగ్ చంకీల (Amarsingh chankila). ఈ సినిమాలో అమర్‌జోత్ కౌర్ పాత్రలో పరిణీతి చోప్రా(Parineeti chopra) ఆకట్టుకుంది. వివాహం అనంతరం ఈ సినిమాతోనే ఆమె తొలి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్‌లో భాగంగా తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది.
దర్శకుడు ఇంతియాజ్ అలీ తనను అమర్యోత్ కౌర్ పాత్ర గురించి సంప్రదించినప్పుడు 15 కేజీల బరువు పెరగాలని కోరారని తెలిపింది. అదేవివిధంగా ఈ పత్రకు అంతగా మేకప్ వేసుకోవద్దని చెప్పారని అందుకు తాను అంగీకరించానని చెప్పింది. అయితే స్క్రీన్‌పై లావుగా కనిపిస్తే కెరీర్ అక్కడితో ఆగిపోయినట్లేనని చాలా మంది తనతో అన్నారని గుర్తుచేసుకుంది. అలాంటి సమయంలో తాను బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్‌ను స్ఫూర్తిగా తీసుకున్నానని తెలిపింది.
విమర్శలను లెక్క చేయకుండా ‘డర్టీ పిక్చర్’ సినిమా కోసం విద్యాబాలన్ బరువు పెరిగిన సంగతి తెలిసిందే. అలా విద్యా బాలన్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు రెండేళ్లు శ్రమించానని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో పాత్రకోసం తన ముందుకొచ్చిన ఎన్నో ఆఫర్లను వదులుకున్నానని తెలిపింది. అంతేకాదు ప్లాస్టిక్ సర్జరీ వదంతులు సైతం ఎదుర్కోక తప్పలేదని చెప్పుకొచ్చింది.
‘బరువు పెరగడంతో నేను నాలా కనిపించలేకపోయా.. కెమెరా ముందుకు రాలేదు. రెడ్ కార్పెట్ ఈవెంట్లలోనూ పాల్గొనలేదు. అందుకు నేనేమీ బాధపడటంలేదు. ఎందుకంటే నాకు వాటికంటే చంకీల లాంటి గొప్ప చిత్రాలే ముఖ్యం..’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రముఖ పంజాబీ గాయకుడు అమర్ సింగ్ చంకీల జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు దిల్జిత్ దొసాంజ్, పరిణీతి చోప్రా ప్రధాన పాత్రధారులు. ఏప్రిల్ 12న నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన ఈ చిత్రం విశేష ఆదరణ పొందుతోంది.