Telugu News » Parking Movie Review : పార్కింగ్ సినిమా ఎలా వుంది..? కథ, రివ్యూ అండ్ రేటింగ్…!

Parking Movie Review : పార్కింగ్ సినిమా ఎలా వుంది..? కథ, రివ్యూ అండ్ రేటింగ్…!

by Sravya

Parking Movie Review : ఈ సినిమా తమిళ్ లో బాగా ఆడింది. ఈ సినిమా డిస్నీ + హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. పార్కింగ్ మూవీ కి రామ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించారు. హరీష్ కళ్యాణ్, ఎం.ఎస్. భాస్కర్, ఇందూజ రవిచంద్రన్ తదితరులు ఇందులో నటించారు. సుదన్ సుందరం, కె.ఎస్. సినీష్ నిర్మించారు. జిజు సన్నీ సినిమాటోగ్రఫీ ని అందించారు.

నటినటులు:హరీష్ కళ్యాణ్, ఎం.ఎస్. భాస్కర్, ఇందూజ రవిచంద్రన్ తదితరులు
దర్శకత్వం: రామ్ కుమార్ బాలకృష్ణన్
నిర్మాత: సుదన్ సుందరం, కె.ఎస్. సినీష్
సంగీతం: సామ్ సి.ఎస్
సినిమాటోగ్రఫీ: జిజు సన్నీ
స్ట్రీమింగ్ : డిస్నీ + హాట్స్టార్

కథ మరియు వివరణ:

ఇక స్టోరీ చూస్తే.. ఈశ్వర్ (హరీష్ కళ్యాణ్) ఐటీ ఉద్యోగం చేస్తుంటాడు. ఆతిక (ఇందూజ రవిచంద్రన్) గర్భిణీ. వీళ్ళు ఇంట్లో తెలియకుండా లవ్ మేరేజ్ చేసుకుని వేరేగా ఉంటుంటారు. బ్రోకర్ ద్వారా ఏకరాజ్ (ఎం.ఎస్. భాస్కర్) ఇంటికి అద్దె కి రావడం జరుగుతుంది. పాత ఇల్లు అయినా అడ్జస్ట్ అవుతాడు. సాఫ్ట్ వేర్ జాబ్, సరిపడా జీతం, భార్యను కూడా చక్కగా చూసుకుంటూ ఉంటాడు. ఈశ్వర్ ఉండే ఇంటి కింద ఏకరాజ్ వాళ్ళు వుంటారు. ఏకరాజ్ పిసినారి. ప్రభుత్వ ఉద్యోగి. కారు కొనుక్కునే కెపాసిటీ ఉన్నా కూడా కొనుక్కోడు. ఇంట్లో ఏమైనా పాడయ్యాయి అని భార్య చెప్పినా కూడా రిపేర్ చేయించడు.

Also read:

ఒక రోజు ఇంటి పైన ఉండే ఐటీ ఉద్యోగి వల్ల కారు కొనాల్సి వస్తుంది. క్యాబ్ వాడు హ్యాండ్ ఇస్తాడు. ఈగో హర్ట్ అయ్యి కారు కొంటాడు. ఏకరాజ్ బైక్ కి, ఈశ్వర్ కారుకి పార్కింగ్ సరిపోదు. కారు పెడితే బైక్ కి ఇబ్బందిగా ఉంటుంది. అతన్ని పిలిస్తే బైకే కదా అడ్జస్ట్ చేసుకోమని అంటదు. ఏకరాజ్ అహం దెబ్బ తింటుంది. దానితో అప్పటికప్పుడు కారు కొంటాడు. రెండు కార్లు ఉన్నాయి. పార్కింగ్ చోటేమో లేదు. ఇక ఇప్పుడు ఏం అవుతుందో తెలియాలంటే ఈ సినిమా ని చూడాల్సిందే. కామెడీ మూవీ కి ప్లస్ అయింది. ఈ మూవీ లో సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ సూపర్బ్. కంటెంట్ ఉన్న సినిమా ని ఇష్టపడే వాళ్లకి కచ్చితంగా మూవీ నచ్చుతుంది.

ప్లస్ పాయింట్స్:

కథ
కామెడీ
నటీనటులు

మైనస్ పాయింట్స్ :

సన్నివేశాలు కొన్ని స్లోగా సాగడం

రేటింగ్: 3/5

 

You may also like

Leave a Comment