Telugu News » Pathangi Toll Plaza: పండుగ ఎఫెక్ట్.. పతంగి టోల్ ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ జామ్..!

Pathangi Toll Plaza: పండుగ ఎఫెక్ట్.. పతంగి టోల్ ప్లాజా వద్ద భారీ ట్రాఫిక్ జామ్..!

మూడు రోజుల పాటు జరిగే పండుగ సందర్భంగా హైదరాబాద్‌(Hyderabad)కు వలస వచ్చిన వారు, విద్యార్థులు స్వగ్రామాలకు బయల్దేరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి.

by Mano
Pathangi Toll Plaza: Festival effect.. Huge traffic jam at Patangi Toll Plaza..!

సంక్రాంతి పండుగను(Sankranti Festival) పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. మూడు రోజుల పాటు జరిగే పండుగ సందర్భంగా హైదరాబాద్‌(Hyderabad)కు వలస వచ్చిన వారు, విద్యార్థులు స్వగ్రామాలకు బయల్దేరుతున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి NH 65 సంక్రాంతి పండుగ కారణంగా రద్దీగా మారింది.

Pathangi Toll Plaza: Festival effect.. Huge traffic jam at Patangi Toll Plaza..!

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా వెళ్తున్నాయి. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. మరో రెండు మూడు రోజుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఏదైనా ప్రమాదం జరిగితే రవాణాకు ఇబ్బంది కలగకుండా ప్రతీ 20కి.మీకి ఒక క్రేన్, ప్రతి 30 కి.మీకి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేశారు.  ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటే 100 లేదా వాట్సాప్ నంబర్ 8712662111లో సంప్రదించాలని భువనగిరి ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. వాహనదారులకు ఏమైనా ఇబ్బందులుంటే 1033 నంబర్‌కు సంప్రదించాలని జీఎంఆర్ మేనేజర్ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

అదేవిధంగా, టోల్ ప్లాజాతోపాటు చౌటుప్పల్ మండలంలోని దండు మైలారం, దండు మల్కాపురం, ఖైతాపురం, ధర్మోజిగూడెం, అంకిరెడ్డిగూడెం, పంతంగి, గుండ్లబావి క్రాసింగ్‌ల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చౌటుప్పల్ మండలంలో ట్రాఫిక్‌ను నివారించేందుకు ఇద్దరు ట్రాఫిక్ సీఐలు, ముగ్గురు ట్రాఫిక్ ఎస్ఐలు, 30 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం అదనపు సిబ్బందిని నియమించారు.

You may also like

Leave a Comment