Telugu News » HBD Annayya: అన్నకు జనసేనాని జన్మదిన శుభాకాంక్షలు…!

HBD Annayya: అన్నకు జనసేనాని జన్మదిన శుభాకాంక్షలు…!

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi ) సినీప్రస్థానం ఎందరికో ఆదర్శనీయం. సామాన్య నటుడిగా మొదలై టాలీవుడ్(Tollywood)లో ఓ సామ్రాజ్య నిర్మాణం చేశారు.

by sai krishna

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi ) సినీప్రస్థానం ఎందరికో ఆదర్శనీయం. సామాన్య నటుడిగా మొదలై టాలీవుడ్(Tollywood)లో ఓ సామ్రాజ్య నిర్మాణం చేశారు.తన మృదుస్వభావంతో శత్రువులని సైతం మిత్రులుగా మలచుకోగల మంచి మనసు ఆయనది.

మెగా కొమ్మను పట్టుకుని పైకొచ్చిన హీరోలు ఇండస్ట్రీలో తమ భవిష్యత్తు పటిష్టం చేసుకున్నారు. అలాంటి వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) ఒకరు. మెగాస్టార్ తమ్ముడిగా కెరీర్ ని ప్రారంభించిన పవన్..అన్న చిరంజీవి గర్వపడేలా టాలీవుడ్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు.

జనసేన పార్టీని సైతం స్థాపించి ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌ డే సందర్భంగా సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌(Emotional post) పెట్టారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు.. అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పవన్‌ సోషల్‌ మీడియాలో పవన్‌ కల్యాణ్‌ పెట్టిన పోస్ట్‌ విషయానికి వస్తే.. “అన్నయ్య చిరంజీవి గారికి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. మీ తమ్ముడుగా పుట్టి మిమ్మల్ని అన్నయ్యా అని పిలిచే అదృష్టాన్ని కలిగించిన ఆ భగవంతునికి ముందుగా కృతజ్ఞతలు.

ఒక సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ మహా నదిగా మారినట్లు మీ పయనం నాకు గోచరిస్తుంటుంది. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాక లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయతీ, సేవా భావం నావంటి ఎందరికో ఆదర్శం.

కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌసలతో సినీ రంగాన అప్రతిహతంగా(unopposed)మీరు సాధిస్తున్న విజయాలు అజరామరమైనవి.

ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు చవిచూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Happy Birthday Annayya.!” అంటూ రాసుకొచ్చారు పవన్‌ కల్యాణ్‌.

You may also like

Leave a Comment