Telugu News » Plane-Car Accident: వైరల్ వీడియో.. కారును ఢీకొట్టిన విమానం..!

Plane-Car Accident: వైరల్ వీడియో.. కారును ఢీకొట్టిన విమానం..!

అమెరికాలో గత కొన్నేళ్లుగా చిన్న విమానాల ప్రమాదాల(plane Accidents) సంఖ్య భారీగా ఉన్నాయి. తాజాగా రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం ఢీకొట్టింది. ఈ ఘటన అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని మెక్కిన్నేలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకొంది.

by Mano
PLANE CAR ACCIDENT

రోడ్డుపై వెళ్లే వాహనాలు ప్రమాదానికి గురయ్యే ఘటనలు రోజూ జరుగుతూనే ఉంటాయి. అయితే ఓ కారు(Car)ను విమానం(Plane) ఢీకొంది. అదేంటీ.. గాలిలో వెళ్లే విమానం రోడ్డుపై వెళ్లే కారును ఢీకొనడమేంటని అనుకుంటున్నారా..? నిజంగానే రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం ఢీకొట్టింది. ఈ ఘటన అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని మెక్కిన్నేలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకొంది.

PLANE CAR ACCIDENT

అమెరికాలో గత కొన్నేళ్లుగా చిన్న విమానాల ప్రమాదాల(plane Accidents) సంఖ్య భారీగా ఉన్నాయి. 2019లో 988 ప్రమాదాలు జరగ్గా.. 307 మంది మృతి చెందారు. 2021లో 939 ప్రమాదాలు జరగగా.. 268 మంది ప్రాణాలు కోల్పోయారు.  తాజాగా జరిగిన ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా.. అతడిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

ప్రమాద సమయంలో ఇద్దరు విమానంలో ఉండగా.. ఒకరు కారులో ఉన్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శనివారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఏరో కౌంటీ ఎయిర్‌పోర్టులో ఓ సింగిల్-ఇంజిన్ జెట్ విమానం రన్‌వేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

విమానం రన్వేపై చివరి వరకు వచ్చినా కంట్రోల్ కాలేదు. దీంతో ఆ బుల్లి విమానం ఎయిర్‌పోర్టు కంచెను దాటుకొని ఈస్ట్ బౌండ్ వర్జీనియా పార్క్‌వేపై వెళుతున్న కారును ఒక్కసారిగా ఢీకొట్టింది. వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకొని పైలట్, కారు డ్రైవర్ను రక్షించాయి. బుల్లి విమానం నెమ్మదిగానే కారును ఢీ కొట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

You may also like

Leave a Comment