Telugu News » Ponnam Prabhakar : అధికారంలో ఉన్నప్పుడు యాదికి లేని మహాత్మా జ్యోతిరావు పూలే ఇప్పుడు గుర్తుకు వచ్చారా..?

Ponnam Prabhakar : అధికారంలో ఉన్నప్పుడు యాదికి లేని మహాత్మా జ్యోతిరావు పూలే ఇప్పుడు గుర్తుకు వచ్చారా..?

అందుకే ప్రగతి భవన్‌కు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పేరు పెట్టుకొన్నట్టు వివరించారు. బీసీలను వంచించిన బీఆర్ఎస్.. బీసీల సంక్షేమం గురించి మాట్లాడటం దయ్యం వేదాలు వల్లించినట్టు ఉందని ఎద్దేవా చేశారు..

by Venu
ponnam prabhakar in Husnabad

బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha)పై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) మండిపడ్డారు.. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రతిష్టించాలంటూ కవిత చేసిన డిమాండ్‌పై తనదైన శైలిలో ఎక్స్ (X) వేదికగా పొన్నం కౌంటర్ ఇచ్చారు. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు యాదికి లేని మహాత్మా జ్యోతిరావు పూలే, ప్రతి పక్షంలోకి వెళ్ళగానే గుర్తుకు రావడం విడ్డూరమని అన్నారు.

minister ponnam prabhakar said that six guarantees have been implemented

అణగారిన జీవితాల్లో వెలుగుల దారులు పంచిన మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు పూలే (Mahatma Jyoti Rao Phule). అలాంటి మహానుభావున్ని ఇంతకాలం విస్మరించడం.. ఇప్పుడేదో బిల్డప్ ఇస్తున్నట్టు వ్యాఖ్యానించడం తగదని పొన్నం సూచించారు. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు యాదికి లేని మహాత్మా జ్యోతిరావు పూలేను మీకు ఎరుక చేసిన తెలంగాణ ఓటర్ల చైతన్యానికి వందనం అన్నారు. అణచివేతకు వ్యతిరేకంగా పూలే సలిపిన పోరాటమే మా ప్రభుత్వానికి ఆదర్శమని పేర్కొన్నారు.

అందుకే ప్రగతి భవన్‌కు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పేరు పెట్టుకొన్నట్టు వివరించారు. బీసీలను వంచించిన బీఆర్ఎస్.. బీసీల సంక్షేమం గురించి మాట్లాడటం దయ్యం వేదాలు వల్లించినట్టు ఉందని ఎద్దేవా చేశారు.. మీ నియంతృత్వానికి ఎదురు తిరిగితే ఒక బీసీ మహిళ అని చూడకుండా జగిత్యాల మున్సిపల్ చైర్మన్‌ను ఏడిపించింది మీరు కాదా? అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.

గత మీ ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్, శాసన మండలి చైర్మన్ బీసీలకు ఎందుకు ఇవ్వలేదని ఎక్స్‌ వేదికగా విరుచుకుపడ్డారు. అధికారాం పొగానే అన్ని గుర్తుకు వస్తున్నాయని.. పదవులు ఉన్నప్పుడు ప్రజలు కంటికి కనిపించలేదని పొన్నం మండిపడ్డారు.. అహంకార పూరితంగా వ్యవహరించి ప్రజల ఆశయాలను బొంద పెట్టినారాని గుర్తు చేశారు..

You may also like

Leave a Comment