Telugu News » Ponnam Prabhakar: ఆర్టీసీలో 800 పైగా కారుణ్య నియామకాలు: మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: ఆర్టీసీలో 800 పైగా కారుణ్య నియామకాలు: మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా వివిధ రకాల ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలకు అండగా నిలుస్తున్ఈనామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కారుణ్య నియామకాల కింద 800మందికి పైగా నియమిస్తున్నట్లు వెల్లడించారు.

by Mano
Ponnam: Minister Ponnam's key decision on the handloom sector... a key suggestion for all!

టీఎస్ఆర్టీసీ(TS RTC)లో కారుణ్య నియామకాల కింద 800మందికి పైగా ఉద్యోగులను నియమిస్తున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Transport and BC Welfare Minister Ponnam Prabhakar) తెలిపారు. కొండాపూర్ ఎనిమిదో బెటాలియన్‌లో టీఎస్ఆర్టీసీ కానిస్టేబుల్‌ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ వీసీ.సజ్జనార్ పాల్గొన్నారు.

Ponnam Prabhakar: Over 800 compassionate appointments in RTC: Minister Ponnam Prabhakar

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆర్టీసీ మనందరిదని, దానిని కాపాడుకోవాలని సూచించారు. ఇందులో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా వివిధ రకాల ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలకు అండగా నిలుస్తున్నామన్నారు. ఈ మేరకు కారుణ్య నియామకాల కింద 800మందికి పైగా నియమిస్తున్నట్లు వెల్లడించారు. ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు.

మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఉచితంగా మహిళలకు ప్రయాణం అందిస్తున్నామని మంత్రి గుర్తుచేశారు. ఇప్పటి వరకు పద్నాలుగున్నర కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారన్నారు. అక్యూపెన్సీ రేషియో బస్టాండ్‌లు ఖాళీగా ఉన్న పరిస్థితి నుంచి బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణం చేస్తున్న సందర్భంలో నూతన బస్సుల కొనుగోలు, నూతన సిబ్బంది నియామకానికి ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ సహకారంతో ఎండీ మార్గదర్శకంలో తగు నిర్ణయాలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆర్టీసీ సంస్థను తిరిగి తెలంగాణ ప్రజలకు నంబర్ 1 రవాణా సంస్థగా ఉంచే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కరోనా, సమ్మె కారణంగా ఆర్టీసీకి పలు సమస్యలు ఏర్పడ్డాయని చెప్పారు. వాటన్నిటినీ అధిగమించడానికి ప్రభుత్వ సహకారం తీసుకుంటుందన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్పులు చేస్తున్నామన్నారు.

You may also like

Leave a Comment