Telugu News » ఫాహద్ ఫాజిల్ బర్త్ డే స్పెషల్…పుష్ప-2 కోసం సరికొత్త షెకావత్..!

ఫాహద్ ఫాజిల్ బర్త్ డే స్పెషల్…పుష్ప-2 కోసం సరికొత్త షెకావత్..!

సుకుమార్(Sukumar)..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు. ఆయన సినిమాల్లో పాత్రలు చాలా సహజంగాను.. వైవిధ్యంగానూ ఉంటాయి.

by sai krishna

సుకుమార్(Sukumar)..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు. ఆయన సినిమాల్లో పాత్రలు చాలా సహజంగాను.. వైవిధ్యంగానూ ఉంటాయి. మామూలు యాక్టర్స్ ను కూడా తన క్రియేటివ్ కోణంలోంచి చూస్తారు.

దానికి కాస్తగణితం..కాస్త కవిత్వం..కాస్త కెమిస్ట్రీ..ఇంకాస్త ఫిజిక్సు, మరికాస్త మాస్ పటాస్ యాడ్ చేసి జనాల మీదకు వదులుతారు. కట్ చేస్తే క్యారెక్టర్ హట్టు బొమ్మ సూపర్ హిట్టు..!

ఇటీవల రిలీజైన పుష్ప(Pushpa) ఫస్ట్ పార్ట్ ఎంత హిట్ అయ్యిందో తెలిసిందే..అల్లు అర్జున్(Allu Arjun) ఐకాన్ స్టార్ అయిపోయాడు. నెక్ట్స్ రాబోతున్న పుష్ప-2 ఇంకా పెద్ద సక్సెస్ కావాలని సుక్కు తెగ ట్రై చేస్తున్నాడు.

ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శర వేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతోఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా చిత్రయూనిట్ పుష్ప-2 కి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ని ప్రేక్షకులకు షేర్ చేశారు.

ఈ సినిమా లో పవర్ ఫుల్ పోలీస్ అధికారి అయిన భన్వర్ సింగ్ షెకావత్ గా నటించిన ఫాహద్ ఫాసిల్(Fahad Faasil) లుక్ ను మేకర్స్ విడుదల చేసారు. ఈ రోజు ఫాహద్ బర్త్ డే కావడంతో మేకర్స్ ఆయనకు విషెస్ తెలియజేస్తూ ఫాహద్ పవర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేసారు. ప్రస్తుతం ఈ లుక్  సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది.

పుష్ప సినిమా క్లైమాక్స్ లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫాహద్ ఎంతగానో మెప్పించారు. పుష్ప సినిమా లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. పుష్ప- 2 లో కూడా షెకావత్ పాత్ర కాస్త ఎక్కువ లెంగ్త్ తో ఉంటుందని సమాచారం.

తాజాగా ఫాహద్ ఫాసిల్ పుష్ప-2 చిత్ర షూటింగ్ లో పాల్గొన్నాడు. షెకావత్ సర్ ప్రతీకారంతో మళ్ళీ తిరిగొస్తున్నారు అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. పుష్ప 2 లో అల్లుఅర్జున్, ఫాహద్ మధ్య వచ్చే సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని సమాచారం. మరి ఈ సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

You may also like

Leave a Comment