జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా తగ్గేదే లేదంటూ రొమ్మువిరిచింది. వివిధ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. గురువారం ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డు(National Film Awards)ల్లో ‘పుష్ప: ది రైజ్’లో అల్లు అర్జున్ చేసిన పవర్ ప్యాక్డ్ నటనకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును ప్రకటించింది.
ఇన్నేళ్ల జాతీయ చలనచిత్ర అవార్డుల చరిత్రలో తొలిసారిగా ఓ తెలుగు నటుడికి దక్కింది. ఈ విషయంలో అల్లు అర్జున్ సాధించింది అద్భుతమనే చెప్పాలి. ఇదివరకు కె.విశ్వనాథ్ (K. Vishwanath ) లాంటి లెంజరీ డైరెక్టర్ దర్శకత్వం వహించిన సాగరసంగమం లాంటి చిత్రాలకు జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో అవార్డ్స్ వచ్చినప్పటికీ వారు తెలుగు భాషకి చెందిన నటులు కాదు.
ఫర్ ద ఫస్ట్ టైమ్ ఒక తెలుగు నటుడికి ఈ అవార్డ్ రావడం అభినందించ తగ్గ విషయం. అవార్డ్ ప్రకటన వెలువడిన వెంటనే టాలీవుడ్ సర్కిల్స్ లో సంబరాలు మొదలయ్యాయి, పరిశ్రమ నలుమూలల నుండి స్టైలిష్ ఐకాన్ స్టార్(Icon Star)కి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
అర్జున్ తండ్రి మరియు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొడుకు సాధించిన ఈ ఘనతకు పుత్రోత్సాహంతో పొంగిపోయారు. అందుకే అభినందిచిన వారిలో మొదటి వ్యక్తి అయ్యాడు.స్టైలిష్ స్టార్ ఇంట్లో తమ కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నాడు.
అవార్డ్ అనౌన్స్ మెంట్ వినగానే అల్లు అర్జున్ తన భార్య స్నేహరెడ్డిని హగ్ చేసుకుని ముద్దుల వర్షం కురిపించాడు, ఈ సినిమాని అద్భుతంగా చెక్కిన దర్శకుడు సుకుమార్ ని అభినందనలతో ముంచెత్తాడు. మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు పలువురు శ్రేయోభిలాషులు నడుమ ఈ అవార్డ్ విన్నింగ్ సంబురం సాగింది.
ఫిల్మ్ సర్కిల్స్ లో ‘బన్నీ’గా పాపులర్ అయిన అల్లు అర్జున్ 1985లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ‘గంగోత్రి’ (2003) హీరోగా అతని తొలి చిత్రం. సినీ ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో అతను హీరో ఏంటి అన్నవాళ్లకు తన డ్యాన్స్,నటనలతో ఆన్సర్ ఇచ్చాడు బన్నీ.
తన హైఓల్టేజ్ యాక్షన్ తో పుష్ప మూవీని మరో మెట్టు ఎక్కించారు, ఈ సినిమాలోని అల్లు అర్జున్ స్టైల్ ఆఫ్ యాటిట్యూడికి అందరూ ఫిదా అయ్యారు. ఈ మూవీలోని అల్లు అర్జును వెదజల్లిన గ్లింప్స్ ను దేశ వ్యాప్తంగానే కాకుండా పలు దేశాల క్రికెటర్స్ కూడా ఇమిటేట్ చేశారు.
కొందరు క్రికెటర్స్ అయితే గ్రౌండ్ లో కూడా అభినయించారు. అప్పట్లో ప్రపంచమంతా పుష్ప ఫీవర్ నడిచింది. కాగా ఇప్పడు అవార్డ్ రావడం తెలుగు సినిమాకి మరింత గౌరవాన్ని పెంచింద ముఖ్యంగా పుష్ప సినిమాలోని సంగీతం, సాహిత్యం చక్కగా కుదిరాయి.
బ్యాగ్ రౌండ్ స్కోర్(Bag round score) తో పాటు ఆణిముత్యాల్లాంటి పాటలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. ఈసినిమాకి దేవీశ్రీప్రసాద్ బ్యాగ్ రౌండ్ స్కోర్ సినిమాకు ఓ రేంజ్ లో నిలబెట్టాయి. సినిమా సక్సెస్ కి ఇంటెర్నేషనల్ గా పాపులర్ చేసిన సంగీతానికి గుర్తింపుగా మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీకి ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డ్ దక్కింది.
ఇక అల్లు అర్జున్ ను అభినందిస్తూ మామ చిరంజీవి అల్లు అర్జున్‌కి అభినందనలు తెలుపుతూ “తెలుగు సినిమా గర్వించదగ్గ క్షణం. ప్రఖ్యాత జాతీయ ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నందుకు నా ప్రియమైన బన్నీకి హృదయపూర్వక అభినందనలు. నీ విజయానికి ఎంతో గర్వపడుతున్నాను.”
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అల్లు అర్జున్‌కి అభినందనలు తెలుపుతూ “పుష్పకు లభించే అన్ని విజయాలకు మరియు అవార్డులకు మీరు అర్హులు” అని అన్నారు. రామ్ చరణ్, వెంకటేష్ లు కూడా అభినందించిన వారిలో ఉన్నారు. కాగా, ఉత్తమ నటుడిగా తొలి జాతీయ అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అభినందించారు.
అలాగే ‘పుష్ప’ చిత్రానికి గాను ఉత్తమ సంగీతానికి జాతీయ అవార్డు లభించినందుకు దేవిశ్రీ ప్రసాద్‌ను అభినందించారు. అల్లు అర్జున్ తన రిప్లైలో జగన్ మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. 69వ జాతీయ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమకు బొనాంజాగా నిలిచాయని ముఖ్యమంత్రి అన్నారు.
ఉత్తమ పాపులర్ చిత్రంతో సహా ఆరు అవార్డులను గెలుచుకున్న ‘ఆర్ఆర్ఆర్’కి ఎస్ఎస్ రాజమౌళిని అభినందించారు.’కొండ పొలం’ చిత్రానికి గాను ఉత్తమ సాహిత్యం అవార్డును గెలుచుకున్న చంద్రబోస్‌ను సీఎమ్ జగన్ రెడ్డి అభినందించారు.