Telugu News » allu arjun: ఏడు దశాబ్దాల కాలంలో బన్నీనే తొలి హీరో!

allu arjun: ఏడు దశాబ్దాల కాలంలో బన్నీనే తొలి హీరో!

నాకు ఉన్న ఆర్మీనే తన ఆస్తి అంటూ ఎన్నో కార్యక్రమాల్లో చెప్పారాయన. బన్నీకి ఉన్న ఆ విధేయతే ఆయన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టిందని చెప్పవచ్చు.

by Sai
allu arjun celebrations

అల్లు అర్జున్‌(allu arjun) గత రాత్రి నుంచి ఎవరి నోట విన్న ఈ పేరే. ఏడు దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా ఓ తెలుగు సినీ హీరోగా అంతర్జాతీయ అవార్డు(national award) అందుకుని చరిత్ర సృష్టించాడు బన్నీ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పిచ్చ హ్యాపీగా ఉన్నారు. తమకే అంతర్జాతీయ అవార్డు వచ్చినంత సంబరపడిపోతూ వేడుకలు జరుపుకుంటున్నారు.

allu arjun celebrations

దర్శకేంద్రుడి దర్శకత్వ పర్యవేక్షణలో గంగోత్రి సినిమాతో టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్‌..పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌ గా ఎదగడమే కాకుండా..అంతర్జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు వచ్చిన తరువాత మీడియా వారు అల్లు అర్జున్‌ స్పందన గురించి అడగగా..మొదటగా ఆయన షాక్‌ లో ఉన్నాను..నేనేమి మాట్లాడలేను అంటూ చెప్పారు.

అల్లు అర్జున్‌ పుష్ప సినిమా కంటే ముందుగానే పాన్‌ ఇండియా లెవల్లో అభిమానులను సొంతం చేసుకున్నాడు. బన్నీ ప్రతి సినిమా కూడా కేరళలో రిలీజ్‌ అవుతుంది. మాలీవుడ్‌ లో అల్లు అర్జున్‌ ది ప్రత్యేక స్థానం అనే చెప్పుకోవచ్చు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ యాస, వేషం రెండు కూడా డిఫరెంట్‌ గా ఉన్నప్పటికీ అభిమానులకు తెగ నచ్చేసింది.

పుష్ప (pushpa)సినిమా ముందు కూడా బన్నీవి ఎన్నో సినిమాలు సూపర్‌ హిట్ గా నిలిచాయి. కానీ పుష్ప సినిమా సాధించిన సూపర్‌ హిట్‌ ముందు అవన్నీ కూడా పక్కకు వెళ్లిపోయాయి.పుష్ప సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్నా కానీ ఇప్పుడు సాధించిన జాతీయ అవార్డు ఓ ఎత్తు.

అసలు బన్నీ హీరో అవ్వడం వెనుక ఉన్నది అందరూ అల్లు అర్జున్ అనుకుంటారు..కానీ కానే కాదు..బన్నీ తల్లి..నిర్మల. చిరంజీవి ఓ పుట్టిన రోజు వేడుకల్లో రాఘవేంద్ర రావు అర్జున్‌ డ్యాన్స్‌ చూసి మీ వాడిని పెద్దయ్యాక హీరోని నేనే చేస్తా అంటూ నిర్మల గారికి ఓ వంద రూపాయలు ఇచ్చారు. ఆయన అన్నట్లుగానే గంగోత్రి సినిమాతో బన్నీని తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆనాడు రాఘవేంద్రరావు ఇచ్చిన వందరూపాయాలు ఇప్పటికీ బన్నీ వద్ద ఉన్నాయి.

మొదటి సినిమాతో పెద్దగా పాపులర్‌ కాకపోయినప్పటికీ రెండో చిత్రం ఆర్య తరువాత బన్నీ వెనుదిరిగి చూడలేదు. బన్నీ ఎప్పుడూ కూడా తన ఫ్యాన్స్‌ను ఎంతో అభిమానిస్తారు. నాకు ఉన్న ఆర్మీనే తన ఆస్తి అంటూ ఎన్నో కార్యక్రమాల్లో చెప్పారాయన. బన్నీకి ఉన్న ఆ విధేయతే ఆయన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టిందని చెప్పవచ్చు.

బన్నీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ..తన కుటుంబంతో గడపడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాడు. బన్నీ ఎంత ఎదిగినా సరే తన తండ్రి స్థానానికి మాత్రం ఎప్పుడూ చేరుకోలేనని చెబుతాడు. నా జీవితం మీద ఎక్కువ ప్రభావం ఎవరిదైనా ఉంది అంటే అది తన భార్య స్నేహదే అని అర్జున్‌ చాలా సందర్భాల్లో పేర్కొన్నాడు.

పుష్ప సినిమా తీసిన సుకుమార్‌ తో బన్నీకి ఇది మూడో ప్రాజెక్ట్‌ . ఇంతకు ముందు ఆయన ఆర్య, ఆర్య 2 తీశారు. ఇప్పుడు పుష్ప ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించింది. మరి కొద్ది రోజుల్లో పుష్ప2 కూడా రాబోతుంది. పుష్ప అంటే ప్లవర్‌ అనుకుంటివా..ఫైరు అంటూ చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరి నోటితో ఈ డైలాగు చెప్పించాడు బన్నీ.

You may also like

Leave a Comment