Telugu News » Sudheer Babu : రాచకొండ సీపీ సీరియస్ వార్నింగ్.. అలా చేస్తే చర్యలు తప్పవు..!!

Sudheer Babu : రాచకొండ సీపీ సీరియస్ వార్నింగ్.. అలా చేస్తే చర్యలు తప్పవు..!!

ముఖ్యంగా సివిల్‌ వివాదాలలో పోలీసులు తలదూర్చకూడదని హెచ్చరించారు.. నిర్దిష్ట ఎస్‌ఓపీ ప్రకారమే నడుచుకోవాలని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే తీవ్రమైన చర్యలు తప్పవని సీపీ తెలిపారు.. నేరాలు తగ్గడానికి.. విజిబుల్‌ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఫుట్‌ పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరంగా చేయాలని సూచించారు.

by Venu

రాచకొండ (Rachakonda) సీపీగా సుధీర్ బాబు ఛార్జ్ తీసుకొని ఐదు రోజులు కూడా గడవక ముందే.. దూకుడుగా వ్యవహరిస్తున్నారు.. ఇప్పటికే డ్రగ్స్‌ మాఫియా అంతు చూస్తామంటూ వార్నింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.. మరోవైపు బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ కాలంలో కల్వకుంట్ల సేవకే పరిమితం అయినా పోలీసు అధికారులు ఇప్పుడిప్పుడే ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తోన్నట్టు సమాచారం.. ఇందులో భాగంగా రాచకొండ సీపీ (CP) సంచలన నిర్ణయాలు తీసుకొంటున్నట్టు తెలుస్తోంది.

కమిషనరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీపీ.. నేరాలను తగ్గించేందుకు సరికొత్త విధానాలు అమలు చేయాలని, నేర పరిశోధనకు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని అన్నారు. రాచకొండ పరిధిలోని పాత నేరస్థుల కదలికల మీద గట్టి నిఘా ఉంచాలని తెలిపారు.. రోజువారీ పెట్రోలింగ్‌ను ఖచ్చితంగా, మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సుధీర్ బాబు (Sudheer Babu) సూచించారు..

ముఖ్యంగా సివిల్‌ వివాదాలలో పోలీసులు తలదూర్చకూడదని హెచ్చరించారు.. నిర్దిష్ట ఎస్‌ఓపీ ప్రకారమే నడుచుకోవాలని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే తీవ్రమైన చర్యలు తప్పవని సీపీ తెలిపారు.. నేరాలు తగ్గడానికి.. విజిబుల్‌ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఫుట్‌ పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరంగా చేయాలని సూచించారు. మహిళా సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, షీ టీమ్స్‌ బృందాలను మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు.

మరోవైపు నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డ్రగ్స్‌ సరఫరా, వినియోగం మీద నిఘా పెంచాలని సీపీ సుధీర్ బాబు ఆదేశాలు ఇచ్చారు.. డిజిటల్‌ యుగంలో పెరుగుతున్న సైబర్‌ నేరాలను (Cyber ​​Crimes) అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకి సూచించారు. ఇక రాష్ట్రంలో జరుగుతోన్న నేరాలని కొత్తగా వచ్చిన సీపీ ఏ మేరకు కంట్రోల్ చేస్తారో ముందు ముందు తెలుస్తోందని అనుకొంటున్నారు..

You may also like

Leave a Comment