Telugu News » Vinod Kumar : రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రమే..!!

Vinod Kumar : రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రమే..!!

రెండు ప్రధాన పార్టీలు తెలంగాణ రాష్ట్రం అప్పుల గురించి చెబుతున్నాయి కానీ.. స్థిరాస్థుల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అని ప్రశ్నించారు. లక్షల ఎకరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం భూ సేకరణ చేసి రాష్ట్రాభివృధ్ధికి తోడ్పడిందని తెలిపిన వినోద్.. ఋణాలు తీసుకొని అభివృద్ధి చేయడం అప్పు కింద రాదని పేర్కొన్నారు.

by Venu

రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అధికారంలోకి రావడం కొందరు బీఆర్ఎస్ (BRS) నేతలు జీర్ణించుకోలేక పొతోన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు రేవంత్ ప్రభుత్వం పై విరుచుకుపడుతోన్నారు.. మరోవైపు బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ( Bandi Sanjay) తెలంగాణ అప్పులపై చేసిన వ్యాఖ్యలకి మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ ఘాటుగా స్పందించారు.

తెలంగాణా రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో అప్పజెప్పాం అని తాను అన్న అంశంపై బండి సంజయ్ విమర్శించడాన్ని తప్పుపట్టిన వినోద్ కుమార్.. నిజాలు గ్రహించకుండా బీజేపీ నేతలు మాట్లాడుతోన్నారని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్.. ఇటీవల జరిగిన ఎన్నికలలో ప్రత్యర్థులు పదే పదే అబద్ధాలు చెప్పడం వల్ల.. బీఆర్ఎస్ పట్ల ప్రజలు తప్పుగా ఆలోచించారని తెలిపారు..

రెండు ప్రధాన పార్టీలు తెలంగాణ రాష్ట్రం అప్పుల గురించి చెబుతున్నాయి కానీ.. స్థిరాస్థుల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అని ప్రశ్నించారు.
లక్షల ఎకరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం భూ సేకరణ చేసి రాష్ట్రాభివృధ్ధికి తోడ్పడిందని తెలిపిన వినోద్.. ఋణాలు తీసుకొని అభివృద్ధి చేయడం అప్పు కింద రాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని పేర్కొన్నారు.

త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు బ్రహ్మాండంగా విజయాన్ని అందిస్తారని వినోద్ కుమార్ (Vinod Kumar) ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి కొన్ని ప్రాంతాలలో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఎదురవుతోందని ఆరోపించారు. మొదటి తేది జీతాలు ఇవ్వలేదన్న బండి సంజయ్, బీజేపీ పాలిత కొన్ని రాష్ట్రాలలో రెండు మూడు నెలలకొకసారి జీతాలు ఇవ్వడం గమనించి మాట్లాడాలని వినోద్ మండిపడ్డారు..

You may also like

Leave a Comment