Telugu News » Raghunandan Rao : ఎంపీ అభ్యర్థులు లేక బీఆర్ఎస్ ఎంతకూ దిగజారింది !!.. రఘునందన్ రావు..

Raghunandan Rao : ఎంపీ అభ్యర్థులు లేక బీఆర్ఎస్ ఎంతకూ దిగజారింది !!.. రఘునందన్ రావు..

ఆయనకు దోచుకోవడం తప్ప ఇంకేం తెలియదని, కలెక్టర్ గా ఉన్నప్పుడు ప్రజలను పీడించి దోచుకున్నారని రఘునందన్ విమర్శించారు.. అలా వచ్చిన డబ్బుతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు..

by Venu
Raghunandan Rao: 'This is proof of your perversion..' Raghunandan Rao fires on BRS..!

త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో నిమగ్నం అయ్యాయి.. అయితే ఈ సారి కూడా మోడీ (Modi)నే ప్రధాని కావాలని ఆశిస్తున్న బీజేపీ (BJP) నేతలు.. ప్రచారంలో ప్రతిపక్షాలపై దూకుడు పెంచారు.. మరోవైపు కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) నేతలు సైతం బీజేపీ పై ఆరోపణలతో విరుచుకు పడుతున్నారు..

raghunandan-raoఈ నేపథ్యంలో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి రఘునందన్ రావు (Raghunandan Rao).. బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.. మెదక్ (Medak) పార్లమెంట్ స్థానానికి పోటీ చేసేందుకు స్థానిక అభ్యర్ధులు దోరకడం లేదా అని బీఆర్ఎస్ అధిష్టానాన్ని ప్రశ్నించారు.. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మెదక్ జిల్లా నిజాంపేట బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్న ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

గతంలో కరీంనగర్ నుంచి హరీష్ రావును తీసుకొచ్చి ఇక్కడ రుద్దారని ఎద్దేవా చేసిన రఘునందన్ రావు.. ఆయన చాలదన్నట్లు ప్రస్తుతం వెంకట్రామిరెడ్డిని తీసుకొచ్చారని వ్యంగ్యాస్త్రాలు వదిలారు.. మెదక్ లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్ధులు లేక అల్లాడిపోతుందని విమర్శించారు.. ఎవరైతే ఏంటీ గెలిస్తే చాలు అనే భావనలో గులాబీ బాస్ ఉన్నారన్నారు.. అసలు ఎంపీగా బరిలోకి దిగుతున్న వెంకట్రామి రెడ్డిది ఏ జిల్లానో, ఏ ఊరో తెలుసా? అని ప్రశ్నించారు..

ఆయనకు దోచుకోవడం తప్ప ఇంకేం తెలియదని, కలెక్టర్ గా ఉన్నప్పుడు ప్రజలను పీడించి దోచుకున్నారని రఘునందన్ విమర్శించారు.. అలా వచ్చిన డబ్బుతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.. ప్రస్తుతం బీఆర్ఎస్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు పెద్దగా తేడా కనిపించడం లేదని మండిపడ్డారు.. రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చిన బీఆర్ఎస్.. పదేళ్లు ఆ ఊసు లేకుండా మాయచేసిందని.. 100 రోజుల్లో చేస్తామని చెప్పిన కాంగ్రెస్ కూడా మాట తప్పిందని గుర్తు చేశారు..

You may also like

Leave a Comment