Telugu News » Kishan Reddy : నెక్స్ట్ ప్రధాని రాహుల్ గాంధీ..!? కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Kishan Reddy : నెక్స్ట్ ప్రధాని రాహుల్ గాంధీ..!? కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఏప్రిల్ 6న ప్రతి పోలింగ్ బూత్‌లో బీజేపీ టిఫిన్ బైటక్ నిర్వహించాలని సూచించారు. నేతలు, కార్యకర్తలంతా ప్రజల్లోకి వెళ్లాలని.. తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ మెజార్టీ సీట్లు గెలుస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు..

by Venu
Rahul Gandhi Takes Supari Swipe At Himanta Sarma During Assam Yatra

తెలంగాణ (Telangana)లో అధికారం ఊరించి ఊరించి చివరికి కాంగ్రెస్ (Congress)కు సొంతం అయ్యింది. అయితే ఇంతటితో కధ ముగియలేదని భావించిన హస్తం.. లోక్ సభ ఎన్నికల్లో గెలిచి.. సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది.. అయితే తెలంగాణాలో కాంగ్రెస్ బలపడాలంటే రేవంత్ తో సాధ్యమని భావించిన అధిష్టానం.. ఆయనకే సీఎం సీటును కట్టబెట్టింది. ఇదంతా పార్లమెంట్ ఎన్నికల ప్లాన్ లో భాగంగా జరిగిందని అనుకొంటున్నారు..

union minister kishan reddy serious on campaign about bjp alliance with brs partyరాష్ట్రంలో రేవంత్ (Revanth Reddy) కాకుండా ఎవరున్నా.. సెంట్రల్లో కాంగ్రెస్.. బీజేపీని ఢీకొట్టలేదని భావించిన అధిష్టానం ఈ నిర్ణయం తీసుకొన్నట్లు అప్పట్లో ప్రచారం సైతం జరిగింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 ఎంపీ సీట్లు తెలంగాణలో గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని సీఎం రేవంత్ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. కాగా ప్రస్తుతం సీఎం మాటలపై కేంద్రమంత్రి, టీ-బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు..

నెక్స్ట్ పీఎం రాహుల్ గాంధీ ?.. అని కలలు కంటున్న కాంగ్రెస్.. తెలంగాణలో 17 ఎంపీ సీట్లు గెలవదన్న విషయాన్ని మరచిపోతుందని విమర్శించారు.. ఈ జన్మలో ఆయన ప్రధాని కాలేరని పేర్కొన్నారు.. మరోవైపు కిషన్ రెడ్డి (Kishan Reddy) అధ్యక్షతన హైదరాబాద్‌ (Hyderabad)లో ఆదివారం బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలు, బూత్ కమిటీల బలోపేతంపై ఈ భేటీలో చర్చించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 6న ప్రతి పోలింగ్ బూత్‌లో బీజేపీ టిఫిన్ బైటక్ నిర్వహించాలని సూచించారు. నేతలు, కార్యకర్తలంతా ప్రజల్లోకి వెళ్లాలని.. తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ మెజార్టీ సీట్లు గెలుస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు.. రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు గెలుపే లక్ష్యంగా పని చేయాలని నేతలకు సూచించారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిన, డబ్బులు ఖర్చు పెట్టిన.. బీజేపీ (BJP)కే డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు.

You may also like

Leave a Comment