Telugu News » Rain Alert: దూసుకొస్తున్న తుపాను.. తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు..!

Rain Alert: దూసుకొస్తున్న తుపాను.. తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు..!

జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. తుపాను సోమవారం తెల్లవారుజామున తూర్పు కోస్తా తీరాన్ని తాకే అవకాశం ఉంది.

by Mano
Rain Alert: Oncoming storm.. Rains for three more days in Telangana..!

బంగాళాఖాతంలో మిచాంగ్ తుపాను(Michaung cyclone) ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. తుపాను సోమవారం తెల్లవారుజామున తూర్పు కోస్తా తీరాన్ని తాకే అవకాశం ఉంది.

Rain Alert: Oncoming storm.. Rains for three more days in Telangana..!

 

ఇదిలా ఉండగా, తుఫాను కారణంగా వచ్చే 3-4 రోజుల పాటు 142 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అంచనా ప్రకారం.. డిసెంబర్ 4 నుంచి 6 వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలపై ‘మైచాంగ్’ తుఫాను ప్రభావం చూపే అవకాశం ఉంది.

తెలంగాణకు తూర్పున ఉన్న ఒంగోలు-కోనసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. అయితే డిసెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ప్రస్తుతం తెలంగాణలో ఆకాశం మేఘావృతమై ఉంది. తూర్పు వైపు నుంచి గాలులు వేగవంగా వీస్తున్నాయి. మరో వారంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడులోని కోస్తా జిల్లాలు వచ్చే వారం ప్రారంభంలో తుపాను భారీ ప్రభావాన్ని చూపనుంది.

You may also like

Leave a Comment