తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth)పై కాంట్రవర్సీ మేఘాలు కమ్ముకున్నాయి. రజనీ..ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కాళ్లకు మొక్కడంపై అభిమానులు, తమిళ ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై రజనీ వివరణ ఇచ్చారు.
ఒకసారి పబ్లిక్ ఫిగర్ అయిన తర్వాత వారి వ్యక్తిగత జీవితం వారి జీవితంలో ఉండదు. అభిమానులు, ఫాలోవర్స్, లేదా సామాన్య ప్రజలు ప్రభావితం అవుతుంటారు,లేదా ప్రభావితం చేస్తుంటారు.
ఈ క్రమంలో పూలేసేవాళ్లే కాదు..రాళ్లేసేవాళ్లవుతారు.రజనీ యోగిని కాళ్లకు మొక్కడం కూడా ఆకోవలోకే వెళుతోంది.దీన్ని తమిళ ప్రజలు అస్సలు జీర్ణించుకోలేక పోతున్నారు. దీనిపై రజనీ స్పందించారు.
“యోగి, సన్యాసీ(monks)ల పాదాలను తాకి, వారి ఆశీర్వాదాలను తీసుకోవడం నా అలవాటు. నాకన్నా చిన్నవారైనా ఇలానే చేస్తాను. అదే ఇప్పుడు కూడా చేశాను” అంటూ తాను చేసిన పనిని సమర్థించుకున్నారు. అలాగే 2024లో తమిళనాడులో జరగబోయే లోక సభ ఎలెక్షన్స్ గురించి అడగగా.. తాను ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడనుకోవట్లేదని పేర్కొన్నారు.