Telugu News » comments maange more : పవన్ ని ప్రేమించినందుకు నేనీ మూల్యం చెల్లించుకోవాల్సిందే…

comments maange more : పవన్ ని ప్రేమించినందుకు నేనీ మూల్యం చెల్లించుకోవాల్సిందే…

ఇటీవల రిలీజ్ అయిన‘బ్రో(Bro)’ మూవీలోని శ్యామ్ బాబు డ్యాన్స్ రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే.

by sai krishna

ఇటీవల రిలీజ్ అయిన‘బ్రో(Bro)’ మూవీలోని శ్యామ్ బాబు డ్యాన్స్ రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య రేణుదేశాయ్(Renudesai)స్పందించి పిల్లల్నిఇలాంటి వివాదాల్లోకి లాగొద్దంటూ విజ్ఞప్తి చేశారు.

వ్యక్తిగతంగా ఆయన చేసిన మోసానికి ఇబ్బంది పడిన మాట వాస్తవమే..కానీ రాజకీయంగా మాత్రం నా మద్దతు ఆయనకే అంటూ రేణు వివరించారు. అయితే తాజాగా మరోసారి రేణుదేశాయ్ స్పందించారు.అయితే దీనిపై ప్రతివిమర్శలు కూడా వచ్చాయి.

తాజాగా మళ్లీ తనపై వస్తున్న ఆరోపణలకు రేణు స్పందించింది. ఓ సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చింది.”నా విడాకుల విషయంలో నా మాజీ భర్త ఎలా మోసం చేశారనే నిజాన్ని మాట్లాడితే గతంలో ఆయన అభిమానులు చాలా దారుణంగా అసభ్యపదజాలంతో తిట్టారు.

ఇప్పుడు ఓ దేశ పౌరురాలిగా ఆయనకు అనుకూలంగా కొన్ని నిజాలు మాట్లాడినప్పుడు ఆయన్ను ద్వేషించేవారు ఇప్పుడు నన్ను తిడుతున్నారు. గతంలో విడాకుల విషయంలో నా మాజీ భర్త గురించి మాట్లాడినప్పుడు..డబ్బులు తీసుకుని అలా అన్నానని ఆరోపించారు.


ఇప్పుడు కూడా అలానే అంటున్నారు.అప్పుడు,ఇప్పుడు రెండు సందర్భాల్లోనూ నిజాన్నే చెప్పాను. ఒక్క మాట తప్పుగా చెప్పలేదు. ఒకప్పుడు ఆయనతో ప్రేమలో పడి నిజం మాట్లాడినందుకు నేనిప్పుడు చెల్లించాల్సిన మూల్యం ఇదేనని అనుకుంటున్నాను. ఇదే నా విధి అయితే అలాగే ఉండనీయండి. ఇంకా అనండి నన్ను” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

You may also like

Leave a Comment