Telugu News » Yadadri Bhuvanagiri : రూ.6 వేల చీర 3వందలకు.. భూదాన్ పోచంపల్లిలో బడా మోసం..!!

Yadadri Bhuvanagiri : రూ.6 వేల చీర 3వందలకు.. భూదాన్ పోచంపల్లిలో బడా మోసం..!!

పోచంపల్లి పట్టు చీరలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచంలో మొట్టమొదటి సారి పోచంపల్లి చీరలకు ప్రత్యేక భౌగోళిక గుర్తింపు (GI )ని ఇచ్చారు. మరోవైపు ఆ చీరలు ఇక్కడే పుట్టాయని చెబుతుంటారు. చీరలకు రంగులు వేసే సంప్రదాయ పద్ధతిని ఇక్కత్ అని పిలుస్తారు.

by Venu

యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా భూదాన్ పోచంపల్లి (Bhudan Pochampally) మండల కేంద్రంలో చేనేత వస్త్రాల షో రూమ్ లపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మరమగ్గాలపై నకిలీ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను తయారు చేసి అమ్ముతున్న 12 షాపుల్లో తనిఖీలు చేశారు. డూప్లికేట్ చీరలను (Sarees) గుర్తించి షాపులకు నోటీసులు జారీ చేశారు.

పోచంపల్లి పట్టు చీరలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచంలో మొట్టమొదటి సారి పోచంపల్లి చీరలకు ప్రత్యేక భౌగోళిక గుర్తింపు (GI )ని ఇచ్చారు. మరోవైపు ఆ చీరలు ఇక్కడే పుట్టాయని చెబుతుంటారు. చీరలకు రంగులు వేసే సంప్రదాయ పద్ధతిని ఇక్కత్ అని పిలుస్తారు. చీరకు ఎక్కడ రంగు వేయాలో ఊహించుకొని అక్కడ వేస్తారు. ఈ పద్ధతిని రెసిస్ట్ డైయింట్ అంటారు.

దారాలకు రంగులేసి, డిజైన్లను వేస్తారు. పురాతన పద్దతుల్లో రెసిస్ట్ డైయింగ్ ఒకటి. పోచంపల్లి ఇక్కత్ చీరలు 1800 కాలంలోనే మంచి పేరు గడించాయి.. అయితే కొందరు ఈ వ్యాపారాన్ని క్యాష్ గా మార్చుకోవాలని ఆశపడ్డారు. ఇదే అదునుగా తీసుకొన్న వ్యాపారులు హ్యాండ్లూమ్ డిజైన్ లను కాఫీ చేస్తూ కనీసం రూ.6 వేలు ఉండాల్సిన చీరలను 300 వందలకు అమ్ముతున్నట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. ఆ చీరలను పరిశీలించి చూస్తే తప్ప నకిలీవి అని తెలియదు. అచ్చం సూరత్ నుంచి తీసుకొచ్చిన చీరల మాదిరిగా కనిపించాయి.

మరోవైపు 1985 చేనేత పరిరక్షణ చట్టం కింద 11 ఐటమ్స్ ను చేనేతకి రిజర్వ్ చేశారు. పోచంపల్లి ఇక్కత్ చీరలను చేతులతో చేయాలి.. కానీ పవర్లూమ్ మిషన్స్ తో చేసి అమ్ముతున్నారు. విజిలెన్స్ అధికారుల తనిఖీల సమయంలో వ్యాపారులు దొంగ చాటుగా స్టాక్ బ్యాగ్ లు తరలించే ప్రయత్నం సైతం చేశారు. కాగా ప్రత్యేక గుర్తింపు ఉన్న పోచంపల్లి చీరల ప్లేసులో ఇలా ప్రింటెడ్ చీరలను అమ్మడాన్ని అధికారులు సీరియస్ గా తీసుకొన్నారు. ఈమేరకు అధికారులు నకిలీ చీరలు తయారు చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

You may also like

Leave a Comment