Telugu News » Salaar movie: సలార్ సీజ్ ఫైర్ అదిరింది.. ఇక పార్ట్-2 టైటిల్ అదే..!

Salaar movie: సలార్ సీజ్ ఫైర్ అదిరింది.. ఇక పార్ట్-2 టైటిల్ అదే..!

సినిమా క్లైమాక్స్ ‌కంప్లీట్ అయ్యాక ఎండ్ క్రెడిట్స్ పడే ముందు అదిరిపోయే సీక్వెన్స్‌ పెట్టాడు దర్శకుడు. ఇక సలార్ పార్ట్ 2 టైటిల్ చివరలో ‘‘శౌర్యాంగ పర్వం’’ అని రివీల్ చేశాడు.

by Mano
Salaar movie: Salaar siege fire is over.. and the title of part-2 is the same..!

పాన్‌ఇండియా హీరో ప్రభాస్(Prabhas), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్‌నీల్(Director Prashanth Neel) కాంబినేషన్‌లో వచ్చిన ‘సలార్’ ఇవాళ(శుక్రవారం) విడుదలైంది. అయితే, భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

Salaar movie: Salaar siege fire is over.. and the title of part-2 is the same..!

కేజీఎఫ్ తరహాలో ఖాన్సార్ సామ్రాజ్యాన్ని సృష్టించిన ప్రశాంత్‌నీల్ ఈ సినిమాను ప్రభాస్ ఫ్యాన్స్‌ కోరుకున్ననట్లుగా చూపించి సఫలమయ్యాడు. కుర్చీకోసం జరిగే పోరాటంలో ఫ్రెండ్‌కు ప్రభాస్‌ ఇచ్చిన విలువలను దర్శకుడు బాగా చూపించాడు. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని పెంచింది.

ఈ సినిమా పూర్తిగా ప్రభాస్ వన్‌మ్యాన్ షో అనే చెప్పాలి. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి ఇండియాస్ బిగ్గెస్ట్ హీరో అని ప్రూవ్ చేశాడు. సినిమా క్లైమాక్స్ ‌కంప్లీట్ అయ్యాక ఎండ్ క్రెడిట్స్ పడే ముందు అదిరిపోయే సీక్వెన్స్‌ పెట్టాడు దర్శకుడు. ఇక సలార్ పార్ట్ 2 టైటిల్ చివరలో ‘‘శౌర్యాంగ పర్వం’’ అని రివీల్ చేశాడు.

ఈ సినిమాలో హీరోయిన్ శృతిహాసన్, పృథ్విరాజ్ సుకుమారన్, శ్రీయా రెడ్డి, ఈశ్వరి రావు, ఝాన్సీ, జగపతిబాబు, సప్తగిరి, బ్రహ్మాజీ, బాబీ సింహా, టినూ ఆనంద్ తదితరులు వారివారి పరిధి మేరకు నటించి మెప్పించారు. మూడు గంటల్లో చూపించిన కథలో అనేక సందేహాలున్నాయి. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని పెంచుతూ పార్ట్-1 ముగుస్తుంది. మరి అవన్నీ రెండో పార్టు ‘‘శౌర్యాంగ పర్వంలో’’లోనైనా తీరుస్తాడో లేదో చూడాలి మరి.

You may also like

Leave a Comment