టెన్నిస్ స్టార్ సానియా మీర్జా(Sania Mirza), పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్(Shoyab Malik) వారి 14ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సానియా మీర్జా పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అందులో సానియా మీర్జా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
సానియా మీర్జాతో పెళ్లికి సంబంధించి ఒక ప్రశ్న తలెత్తిన వీడియో ట్విట్టర్లో కనిపించింది. కొత్త జంటలకు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే ఏం చెబుతారని సానియాను ఈ వీడియోలో ప్రశ్నించారు. దీనికి సానియా మీర్జా.. ‘‘పెళ్లి తర్వాత మిమ్మల్ని మీరు మార్చుకోవద్దు.. ఎందుకంటే మీరు ఎలా ఉండాలని కోరుకుంటారో అలాగే ఉండాలి..’’ అంటూ సూచించింది.
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది సానియాను ప్రశంసిస్తున్నారు. సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌లకు ఒక కుమారుడు ఉన్నాడు. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 41 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకుని సానియా మీర్జాతో సంబంధాన్ని ముగిసినట్లు ప్రకటించాడు. సానియా తన ఇష్టానుసారం సంబంధాన్ని ముగించుకున్నట్లు సానియా కుటుంబ సభ్యులు ప్రకటించారు.
అప్పటి నుంచి, ఈ ఇద్దరికి సంబంధించిన అనేక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక విడాకుల తర్వాత సానియా మీర్జా రెండో వివాహంపై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టీమిండియా క్రికెటర్ల పేర్లనూ ప్రస్తావిస్తున్నారు. మరి ఈ విషయంపై సానియా ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి.
Sania Mirza has something important to say Shoaib Malik should have listened #ShoaibMalikMarriage pic.twitter.com/mrxcCIw4mU
— Naturegirl (@Nature_22) January 24, 2024