Telugu News » Shanmukh Jaswant: ‘అరె ఏంట్రా ఇదీ..’ గంజాయితో పట్టుబడ్డ షణ్ముఖ్ జస్వంత్..!

Shanmukh Jaswant: ‘అరె ఏంట్రా ఇదీ..’ గంజాయితో పట్టుబడ్డ షణ్ముఖ్ జస్వంత్..!

షణ్ముఖ్‌ జస్వంత్‌పై మరో కేసు నమోదైంది. పోలీసులు అతన్ని గంజాయితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈమేరకు అతడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

by Mano
Shanmukh Jaswant: 'Hey what's this..' Shanmukh Jaswant caught with ganja..!

బిగ్‌బాస్ ఫేమ్(Bigg Boss fame) షణ్ముఖ్ జస్వంత్(Shanmukh Jaswant) గురించి తెలిసిందే. యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్‌లతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. షణ్ముఖ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘అరె ఏంట్రా ఇదీ..’ అనే డైలాగ్‌తో బాగా ఫేమస్ అయ్యాడు.

Shanmukh Jaswant: 'Hey what's this..' Shanmukh Jaswant caught with ganja..!

ఆ ఫేమ్‌తోనే అతడు బిగ్‌బాస్‌-5లోకి అడుగుపెట్టాడు. అయితే, షణ్ముఖ్ తన యాక్టింగ్‌తో సెలెబ్రిటీగా మారినా.. పోలీస్ కేసులతో వార్తలకెక్కుతున్నాడు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఈ యంగ్ యాక్టర్‌ అప్పుడు ఎలాగో అలా బయటికొచ్చాడు.

అయితే, ఇప్పుడు షణ్ముఖ్‌ జస్వంత్‌పై మరో కేసు నమోదైంది. పోలీసులు అతన్ని గంజాయితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈమేరకు అతడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ ప్రేమ పేరుతో  మోసం చేశాడంటూ ఓ యువతి ఆరోపించింది.

తనను కాదని మరొకరితో పెళ్లి చేసుకున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు సంపత్ వినయ్ కోసం అతడి ఫ్లాట్‌కు వెళ్లారు. అయితే, తనిఖీల్లో ప్లాట్‌లో ఉన్న షణ్ముఖ్ వద్ద గంజాయి, మత్తు పదార్థాలు దొరికాయి. దీంతో అన్నదమ్ములను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.

You may also like

Leave a Comment