ఐకాన్ స్టార్(Icon Star) అల్లు అర్జున్(Allu Arjun) కెరీర్లోనే ది బెస్ట్ మూవీ అంటే మాత్రం ‘పుష్ప’(Pushpa). ఎప్పుడూ చూడని లుక్‌లో ఊర మాస్ గెటప్‌లో బన్నీ తన ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రం విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
ఇక హిందీలో అయితే ఈ చిత్రం ఏకంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగులో బన్నీ చిత్తూరు యాసలో అలరించాడు. హిందీలో బన్నీకి.. నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రేయాస్ తల్పడే(Shreyas Talpade) వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ చిత్రం సక్సెస్‌లో శ్రేయాస్ కీలక పాత్ర పోషించాడు.
దీంతో హైదరాబాదీలు సైతం శ్రేయాస్‌కు అభిమానులు ఏర్పడ్డారు. తాజాగా శ్రేయాస్‌కు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం శ్రేయాస్ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ శ్రేయాస్ త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే శ్రేయాస్.. ఆరోగ్య పరిస్థితిపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు పుష్ప-2 షూటింగ్ కొనసాగుతోంది. ఈ చిత్రంలోనూ శ్రేయాస్.. అల్లు అర్జున్‌కు డబ్బింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది.