Telugu News » రూ.3.50 కోట్లు పెట్టి.. సింహాసనం సినిమా తీస్తే.. ఎంత వచ్చిందో తెలుసా..?

రూ.3.50 కోట్లు పెట్టి.. సింహాసనం సినిమా తీస్తే.. ఎంత వచ్చిందో తెలుసా..?

by Sravya

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఎన్నో సినిమాలు వచ్చాయి. చాలా సినిమాలు హిట్లు అయ్యాయి కూడా. సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు తెలుగు సినిమా పరిశ్రమ కి ఎన్నో రకాల టెక్నాలజీ లని పరిచయం చేసిన ఘనత ఆయనదే. మొదట కౌబాయ్ సినిమా చేశారు. మొదటి కలర్ సినిమా ఆయనది. మొదట గూఢచారి సినిమాను తీసింది కూడా ఈయనే. కృష్ణ పేరిట ఎన్నో రికార్డులు కూడా ఉన్నాయి. కృష్ణ కెరియర్ లో అత్యంత భారీగా హిట్ అయిన సినిమాల్లో సింహాసనం చెప్పుకోదగ్గది. సింహాసనం సృష్టించిన ప్రభంజనం ఇంత అంతా కాదు. సింహాసనం సినిమాని ఇప్పటి బాహుబలి సినిమాతో మనం కంపేర్ చేయొచ్చు.

సింహాసనం సినిమా ట్రెండ్ ని క్రియేట్ చేసేసింది ఆయనకి 1980లో జానపద సినిమా తీయాలని ఉండేదట. దీంతో సింహాసనం సినిమాని స్టార్ట్ చేశారు అయితే ఈ సినిమాకి బడ్జెట్ ఎక్కువ వేశారు. ఏకంగా 3.5 కోట్లతో సినిమా తీయాలని అనుకున్నారు. కానీ సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతలు నష్టపోతారని కృష్ణ అనుకున్నారు. దీనితో ఆయనే స్వయంగా పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై సినిమాని నిర్మించాలని అనుకున్నారు. సినిమాని తీశారు ఆయనే దర్శకత్వం వహించారు.

Also read:

నిత్యం ఈ సినిమాపై వార్తలు పేపర్ లో వచ్చేవి దాంతో ప్రేక్షకులకి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. బాలీవుడ్ నటి మందాకిని తో పాటు జయప్రద రాధా కూడా నటించారు. మూవీ షూటింగ్ 53 రోజుల్లో పూర్తి చేసేసారు. అప్పట్లో సినిమా తీయాలంటే 50 లక్షల బడ్జెట్ ని కేటాయించారు. కానీ ఈ సినిమాను ఏకంగా మూడు కోట్లకి పెట్టి తీశారు. తెలుగుతో పాటుగా హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ అయింది. సంచలనాన్ని సృష్టించింది. ఏకంగా టికెట్ల కోసం 12 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కట్టే వారట ప్రేక్షకులు. మొత్తంగా ఈ సినిమా ఏడు కోట్ల రూపాయలని వసూలు చేసి, రికార్డును సృష్టించింది. వంద రోజులు వేడుకని చెన్నైలో ఘనంగా నిర్వహించారు. కృష్ణ ఫ్యాన్స్ అప్పట్లో ఏకంగా 400 బస్సుల్లో ఈ వేడుకకి వచ్చే చరిత్రను సృష్టించారు.

 

You may also like

Leave a Comment