Telugu News » న‌టి హేమ భ‌ర్త ఎవరో తెలుసా..? ఆయన ఏం చేస్తారంటే..?

న‌టి హేమ భ‌ర్త ఎవరో తెలుసా..? ఆయన ఏం చేస్తారంటే..?

by Sravya
hema-husband

హేమ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎప్పటి నుండో హేమ రకరకాల పాత్రలు చేస్తూ అందరిని మెప్పిస్తున్నారు. అలానే సినిమాల్లోనే కాకుండా తరచు ఏదో ఒక వివాదం లో ఈమె వార్తలు నిలుస్తూ ఉంటుంది. హేమ భర్త గురించి చాలా మందికి తెలియదు హేమ భర్త గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని పొందుపరిచాము. హేమ అనేక సినిమాలో కనపడుతూ ఉంటుంది. ఈమె చాలా మంది సీనియర్ యాక్టర్ల పక్కన కూడా నటించింది. హేమ అక్కగా, వదినగా ఇలా ఎన్నో రకాల పాత్రలు చేస్తూ ఉంటుంది. హాస్యాన్ని కూడా ఈమె చక్కగా పండించగలదు.

అందరిని హేమ నవ్విస్తూ అలరిస్తూ ఉంటుంది. ఇప్పటికీ సినిమాల్లోనే నటిస్తోంది. చిన్న వయసు లోనే ఈమె ఇండస్ట్రీ కి వచ్చింది దాదాపు 400 కి పైగా సినిమాలు లో నటించింది. కెరియర్ పరంగా నటి హేమ సక్సెస్ ని అందుకుంది. అందులో సందేహమే లేదు. అయితే నటిగా సక్సెస్ ని అందుకున్న హేమ వెనుక తన భర్త ప్రేమ, ప్రోత్సాహం ఉందట. నటి హేమ భర్త ఎవరనేది చాలా మందికి తెలీదు. హేమ భర్త ఎవరంటే..? అతని పేరు సయ్యద్ జాన్ అహ్మద్.

Also read:

సయ్యద్ జాన్ అహ్మద్ కెమెరామెన్ సినీ ఇండస్ట్రీ లో మంచి పేరుని తెచ్చుకోవడం జరిగింది. ఈయన కూడా ప్రస్తుతం చిత్రపరిశ్రమం లోనే పని చేస్తున్నారట. సయ్యద్ జాన్ అహ్మద్ తండ్రి పేరు జాన్ ఎస్డీ లాల్. నటి హేమని సయ్యద్ జాన్ అహ్మద్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది వీరికి ఒక కూతురు కూడా ఉంది. ఇండస్ట్రీలో ఉన్న నటి హేమని ఆమె భర్త ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. హేమ సక్సెస్ ని అందుకోవడానికి తన భర్త ప్రోత్సాహం ఎంతో వుంది అని చాలా సందర్భాల్లో హేమ ఈ విషయాన్ని వెల్లడించింది.

You may also like

Leave a Comment