Telugu News » శోభన్ బాబు ఇప్పుడే పుట్టి ఉంటె ఇలానే ఉండేవాడా.. వైరల్ అవుతున్న వీడియో!

శోభన్ బాబు ఇప్పుడే పుట్టి ఉంటె ఇలానే ఉండేవాడా.. వైరల్ అవుతున్న వీడియో!

వైరల్ అవుతున్న శోభన్ బాబు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ వీడియో!

by Sri Lakshmi

నిన్నటి తరం హీరోలలో టాలీవుడ్ అందగాడిగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆయన సినిమాల లిస్ట్ మొదలు పెడితే చాట భారతం అవుతుంది. తెలుగులో చాలా సినిమాలే చేశారాయన. ఈయనకు ఫాన్స్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్ లో ఉండేది. తెలుగు హీరోల లుక్ ఇలానే ఉంటుంది అన్న ఊహాగానాలను బీట్ చేసి హాలీవుడ్ హీరోలకు దలదన్నేలా తనని తాను ప్రపంచానికి చూపించుకున్నాడు.

ఆరోజుల్లోనే ఆయన ఫాన్స్ హాలీవుడ్ హీరోలకు తలదన్నేలా ఉంటాడు మా హీరో అని చెప్పుకునేవారట. నటన పరంగా ఎంత మంది హీరోలు వచ్చినా.. అందం విషయంలో మాత్రం ఆయన్ని మించి మరొకరు లేరనే చెప్పచ్చు. ఇప్పుడు శోభన్ బాబు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఎందుకంటే ఆయనకు సంబంధించి ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ వీడియో ను ఎడిట్ చేసారు.

బీచ్ వద్ద నుంచి శోభన్ బాబు నడుచుకుంటూ వస్తున్న శోభన్ బాబు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియో ను చూసి శోభన్ బాబు అభిమానులు ఫుల్ హ్యాపీ అయిపోతున్నారు. ఒకప్పటి శోభన్ బాబు అందం అప్పటి తరానికి మాత్రమే తెలుసు. నేటి తరంలో ఆయన రూపం ఎలా ఉంటుందో ఈ వీడియోలో అందరు చూడొచ్చు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ మేలు ఎంత చేస్తుందో అంతే కీడు కూడా చేస్తుంది. అయితే.. మనం దాన్ని ఉపయోగించుకునే విధానంలో ఉంటుంది ఏదైనా అని చెప్పడానికి ఈ వీడియోనే ఓ మంచి ఉదాహరణ.

You may also like

Leave a Comment