మహిళా ఫుట్ బాల్ వరల్డ్ కప్(World Cup)విజేత జెన్నీ హెర్మొసో(Jenni Hermoso) విషయంలో స్పెయిన్ ఫుట్ బాల్ చీఫ్ లూయిస్ రుబియేల్స్(Luis Rubiales) ప్రదర్శించిన అత్యుత్సాహానికి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. జెన్నీ పెదవులపై ముద్దు పెట్టడం తీవ్ర దుమారం రేగడంతో సోషల్ మీడియాలో సారీ చెప్పాడు.
స్పెయిన్ మహిళల జట్టు ఫైనల్లో గెలవగానే మైదానంలో సంబురాలు చేసుకుంది. ఆ సమయంలోనే లూయిస్, జెన్నీకి పెదవులపై ముద్దు పెట్టాడు. ఆ వీడియో ఇన్‌స్టాగ్రామ్(Instagram), యూట్యూబ్‌లో వైరల్ అయింది.
ఈ వీడియో చూసిన ప్రజలు కోపంతో ఊగిపోయారు. లూయిస్‌పై భారీగా వ్యతిరేకత రావడంతో ఆ దేశ ఉప ప్రధాని అతడిని రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించాడు.ఈ నేపథ్యంలో లూయిస్ తన తప్పు ఒప్పుకొని జెన్నీకి సారీ చెప్పాడు.
‘నేను కచ్చితంగా పొరపాటు చేశాను.నేను ఒప్పుకుంటున్నా.అయితే..చెడు ఆలోచనతో నేను ఆమెకు ముద్దు పెట్టలేదు. పట్టలేనంత సంతోషంలో ఉన్న ఆ క్షణంలో పరస్పర అంగీకారంతోనే అది జరిగింది’ అని ఓ లెటర్ విడుదల చేశాడు.
కానీ, అతను ఉద్దేశ పూర్వకంగానే మరికొందరితోనూ అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. మహిళా ప్లేయర్ల చెంపలపై ముద్దులు పెట్టడమే కాకుండా అవార్డు ప్రదాన సమయలోనూ లూయిస్ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడని కొందరు ఆరోపిస్తున్నారు.
ఆదివారం ముగిసిన ఫిఫా వరల్డ్ కప్ (FIFA Women’s World Cup) ఫైనల్లో స్పెయిన్ మహిళల జట్టు విజేతగా నిలిచింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో మొదటి అర్ధ భాగంలో కెప్టెన్ ఒల్గా కార్మోనా(Olga Carmona) గోల్ కొట్టింది.
దాంతో, ఇంగ్లండ్‌పై 1-0తో గెలిచిన స్పెయిన్ ట్రోఫీని అందుకుంది. ప్రపంచ కప్‌తో స్వదేశానికి వెళ్లిన స్పెయిన్ జట్టుకు అక్‌చడ ఘన స్వాగతం లభించింది. వీళ్ల విజయాన్ని ప్రజలు పెద్ద పండుగలా చేసుకున్నారు. బాణాసంచా పేల్చి, డీజేలు పెట్టి ఉత్సాహంగా ఆడిపాడారు.