అంతర్జాతీయ వాణిజ్యంలో చేరేందుకు కొలంబో సిద్ధమవుతున్న తరుణంలో ఇరాన్ యుద్ధనౌకలు శ్రీలంకకు చేరుకున్నాయి. ఎర్ర సముద్రం(Red Sea)లో వాణిజ్య నౌకల(Commercial ships)పై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే.
ఈ దాడులకు వ్యతిరేకంగా శ్రీలంకతో చేతులు కలపడానికి ఈ రెండు యుద్ధనౌకలను పంపినట్లు తెలుస్తోంది. శ్రీలంక నేవీతో సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఇరాన్.. IRINS బుషెహర్, టోన్బా అనే రెండు యుద్ధనౌకలను పంపించింది.
ఈ నౌకలు శ్రీలంకలోని కొలంబోకు శుక్రవారం చేరుకున్నాయి. వీటికి శ్రీలంక నేవీ స్వాగతం పలికింది. బుషెహర్ 107 మీటర్ల ఎత్తు, ఇందులో 270 మంది సిబ్బంది ఉంటారు. కాగా, టోన్బా దాదాపు 94 మీటర్లు పొడవు ఉంటుంది. ఇందులో 250 మంది సిబ్బంది ఉంటారు.
యుద్ధనౌకల కమాండింగ్ అధికారులు తమ దేశంలో ఉన్న సమయంలో పశ్చిమ నావికా ప్రాంత కమాండర్- శ్రీలంక నేవీ డైరెక్టర్ జనరల్‌ను కలవనున్నారు. ఇక, ఇరాన్ నౌకల సిబ్బంది శ్రీలంకలోని అనేక పర్యాటక కేంద్రాలను సందర్శించే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధనౌక ఫిబ్రవరి 19న శ్రీలంక నుంచి బయలుదేరుతుంది.