Telugu News » నన్ను క్షమించండి అంటూ సారీ చెప్పిన సుమ… ఇంతకీ అసలు ఏం అయ్యిందంటే..?

నన్ను క్షమించండి అంటూ సారీ చెప్పిన సుమ… ఇంతకీ అసలు ఏం అయ్యిందంటే..?

by Sravya

యాంకర్ సుమ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సుమ అందరికీ సుపరిచితమే. సుమ టీవీ షోలో కనబడి అందరిని ఆకట్టుకుంటుంది. తనదైన యాంకరింగ్ తో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. సుమ బుల్లితెర మీద గత 20 ఏళ్లుగా సుమ తన ప్రస్తానాన్ని కొనసాగిస్తూ ఉంది. హీరోయిన్ గా కెరియర్ ని మొదలుపెట్టిన సుమ తర్వాత యాంకర్ గా మారారు. తెలుగు అమ్మాయి కాకపోయినా తెలుగు అనర్గళంగా మాట్లాడి అందరిని అవాక్ అయ్యేలా చేస్తుంది.

Also read:

తెలుగు ప్రముఖ టీవీ చానల్స్ అన్నిట్లో కూడా సుమకి సంబంధించిన షోలు నడుస్తూ ఉంటాయి. సుమ వల్ల కొన్ని చానల్స్ టిఆర్పి రేటింగ్స్ కూడా పెరుగుతున్నాయి. పైగా తెలుగు హీరోలు అందరికీ కూడా సుమ ఫేవరెట్ యాంకర్. సుమ ఉంటే ఈవెంట్లు నిండుగా ఉంటాయని అందరూ భావించి వాళ్ళ సినిమా ఈవెంట్ల కోసం పిలుస్తూ ఉంటారు ఇక తాజాగా సుమ వార్తల్లోకి ఎక్కేసింది. ఆది కేశవ సినిమా ఈవెంట్లో సుమ యాంకరింగ్ గా సందడి చేశారు.

అయితే మీడియా సంస్థల రిపోర్టర్లని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ మీడియా వాళ్ళు స్నాక్స్ ని కూడా భోజనంలా చేస్తారని సుమ సెటైర్స్ వేశారు. అంతే ఒక రిపోర్టర్ గట్టిగా రియాక్ట్ అయ్యారు. మీడియాను మీరు అనడం సరైనది కాదు అని అన్నారు. మీ యాంకరింగ్ అంటే మాకు ఇష్టమే కానీ అలా అనకుండా ఉండాల్సిందని అన్నారు. అయితే దీనిపై సుమ వెంటనే క్షమాపణ కోరారు మేటర్ పెద్దది కావడంతో ఈవెంట్ ముగిసిన తర్వాత సుమ ఒక వీడియోని పోస్ట్ చేసి మరొకసారి క్షమాపణ కోరారు. అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది సుమ ఇలా అని ఉండకూడదని చాలామంది అంటున్నారు.

You may also like

Leave a Comment