నటి సూర్యకాంతం గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సూర్యకాంతం అందరికీ సుపరిచితమే. తెలుగు ప్రేక్షకులకి పరిచయం లేని పేరు సూర్యకాంతం. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరుని తెచ్చుకుంది. ఒకప్పుడు సూర్యకాంతం డేట్ ల కోసం దర్శక నిర్మాతలు ఎంత గానో ఎదురు చూసేవారట. ఆమె డేట్స్ కోసం సినిమా షూటింగ్లను కూడా వాయిదా వేసుకునేవారు. గయ్యాళి అత్త అంటే సూర్యకాంతం పెట్టింది పేరు. ఆమె నటించిన సినిమాల ద్వారా గాయాల అత్తగా పేరు తెచ్చుకుంది కానీ నిజ జీవితంలో ఆమె అలా ఉండేవారు కాదట. ఆమె చాలా మంచి వారట.
సూర్యకాంతం సినిమాలకు సంబంధించిన విషయాలు మనకి తెలుసు కానీ ఆమె పర్సనల్ లైఫ్ గురించి చాలా విషయాలు మనకి తెలియదు. సూర్యకాంతం ఎక్కడ పుట్టారో తెలుసా..? సూర్యకాంతం కాకినాడలో పుట్టారు. మద్రాస్ కి చెందిన ఒక జడ్జిని పెళ్లి చేసుకోవడం ద్వారా ఆమె మద్రాసులో ఉండేవారట. తర్వాత హైదరాబాద్ కి మకాం మార్చుకున్నారు చివరి దాకా కూడా హైదరాబాదులోనే ఉండిపోయారు. ఆమె ఎన్నో సేవలు చేసేవారు హైదరాబాద్ కాకినాడ తో పాటుగా ఇతర ప్రాంతాల్లో సత్రాలని ఏర్పాటు చేసి అనాధలని ఈమె చేర తీశారు.
Also read:
చెన్నైలో చాలామంది భర్త లేని స్త్రీలని ఆదుకున్నారు సూర్యకాంతం. సూర్యకాంతం భర్త జడ్జి అయినా షూటింగ్లో సూర్యకాంతం బిజీగా ఉంటే ఆమె కోసం స్టూడియో ముందు వచ్చి ఎదురు చూసేవారట. సూర్యకాంతం ఇప్పుడు ఈ లోకంలో లేకపోయినా చాలామంది హృదయాల్లో ఇంకా నిలిచిపోయారు. అయితే సూర్యకాంతం సినిమాలు చూసే చాలామంది ఆమె దగ్గరికి వెళ్లడానికి భయపడేవారు. ఎప్పుడైనా ఏదైనా సమావేశాలకి కానీ సినిమా ఉత్సవాలకి కానీ ఆడవాళ్ళు ఎవరైనా వెళ్లి ఆటోగ్రాఫ్ అడగాలంటే భయపడిపోయేవారట ఈమె మాత్రం చాలా ఖచ్చితమైన మనిషి. సహృదయగల మనిషి. ఈమె పది మందికి కూడా సహాయం చేసేవారట.