ప్రస్తుతం లైఫంటే కాలంతో పరుగు పెట్టటమే! పరిగెత్తాలంటే స్టామినా కావాలి. స్టామినా కావాలన్నా పరుగులు తియ్యాల్సిందే! వెరసి జీవితం అంటే ఉరుకు పరుగు. సరే ఈ పరుగులు పక్కనబెడితేవిరాట్ – అనుష్కలు పరుగెడుతున్న ఫోటోను అనుష్క తన ఇనిస్టాలో పోస్ట్ చేసింది.
దానికి క్రికెటర్ సూర్య తనదైన శైలిలో ఫన్నీ కామెంట్ చేశాడు. ‘భయ్యా.. మీ రన్నింగ్ టెక్నిక్ లోపించినట్లు ఉంద’ని సూర్య తన కామెంట్‌లో పేర్కొన్నాడు.ప్రస్తుతం విరాట్ బ్రేక్ లో ఉన్నాడు.మళ్లీ ఆసియా కప్ లో ఆడేందుకు కసరత్తు మొదలుపెట్టాడు. ఈ గ్యాప్ లో కోహ్లీ సరదాగా ‘ప్యూమా(Puma)’ కోసం ఒక యాడ్ చేశాడు. సదరు యాడ్ ఫోటోలను అనుష్క ఇనిస్టాలో పోస్ట్ చేసింది. దీనిపై సూర్య పైవిధంగా ఫన్నీ కామెంట్స్ చేశాడు.
వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడిన కోహ్లీ..ఇక ఆసియాకప్(Asia Cup)లో సెప్టెంబర్ రెండో తేదీన పాక్‌తో జరగనున్న మ్యాచ్‌తో మళ్లీ క్రీజ్‌లో అడుగుపెడతాడు. ఆ హైవోల్టేజ్ మ్యాచ్ గురించి క్రికెట్ ప్రియుల్లో అప్పుడే ఫుల్ హీట్ నడుస్తోంది.
బాబర్ ఆజమ్(Babar Azam) ఫామ్‌లో ఉన్నాడని, అతనికి కోహ్లీ కంటే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని ఓ చర్చలో పాక్ మాజీ బౌలర్ అకీబ్ జావెద్(Aqib Javed)అన్నాడు. దీంతో ఇండోపాక్ మ్యాచ్‌పై ఆసక్తి రేగినట్టైంది.
ఇక కోహ్లీ ఆ మ్యాచ్ కోసం జోరుగా ప్రిపేరవుతున్నట్లు తెలుస్తోంది. దాని పర్యవసానమే ఈ ఉరుకులు పరుగులు అనుకోవాలేమో..! విరాట్ బాబు ప్రత్యర్థులను పరిగెత్తించేందుకు పరుగో పరుగు.