Telugu News » Telangana : కేటీఆర్.. రేవంత్ రెడ్డిని బెదిరిస్తున్నారా..!?

Telangana : కేటీఆర్.. రేవంత్ రెడ్డిని బెదిరిస్తున్నారా..!?

మరోవైపు సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి మొదటి రోజే ఇంటలిజెన్స్ చీఫ్ ను నియమించుకొన్నారు. తనకు ఉన్నది నలుగురు ఎమ్మెల్యేల మెజార్టీ అని ఆయనకు తెలుసు. ప్రభుత్వాన్ని కాపాడు కోవాలంటే ఏం చేయాలో సీఎం ముందుగానే వ్యూహాలు రచించిపెట్టుకొన్నట్టు ఇదివరకే ఆయన మాటల్లో సృష్టం చేశారు..

by Venu

తెలంగాణ (Telangana) రాజకీయాలు రోజు రోజుకు యూ టర్న్ తీసుకొంటున్నాయని అనుకొంటున్నారు. కేటీఆర్ (KTR) తరచుగా కాంగ్రెస్ (Congress)పై విమర్శలు చేస్తుండటం.. బీఆర్ఎస్ అధికారంలో వస్తుందని పదే పదే వల్లెవేయడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం అన్నాక విజయాలు.. వైఫల్యాలు సర్వసాధారణమే.. అంత మాత్రానికే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఒకే పాట పాడటంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతోన్నారు.

 

అయితే కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపై కేటీఆర్ వ్యాఖ్యలు.. పార్టీ నేతలతో అనిపిస్తున్న కామెంట్స్ కు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఘాటుగా స్పందించారు.. అసలు విషయం తెలుసుకొందామని రంగంలోకి దిగినట్టు సమాచారం.. విదేశీ పర్యట నుంచి రాగానే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ఆయన కలిసినట్టు తెలుస్తోంది. అయితే కేటీఆర్ చేస్తున్న వాఖ్యలపై మాట్లాడిన వారు.. అలాంటి ఉద్దేశ్యం తమకు లేదని తెలిపినట్టు టాక్ వినిపిస్తోంది. ఇదే అంశంపై ఇంటలిజెన్స్ చీఫ్ శివనాథ్ రెడ్డితో సైతం మాట్లాడినట్టు సమాచారం.

మరోవైపు సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి మొదటి రోజే ఇంటలిజెన్స్ చీఫ్ ను నియమించుకొన్నారు. తనకు ఉన్నది నలుగురు ఎమ్మెల్యేల మెజార్టీ అని ఆయనకు తెలుసు. ప్రభుత్వాన్ని కాపాడు కోవాలంటే ఏం చేయాలో సీఎం ముందుగానే వ్యూహాలు రచించిపెట్టుకొన్నట్టు ఇదివరకే ఆయన మాటల్లో సృష్టం చేశారు.. ఈ క్రమంలో కేటీఆర్.. రేవంత్ రెడ్డిని బెదిరించడానికో లేకపోతే తమ పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించడానికో కానీ.. పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనే ప్రకటనలు చేయడం వారికే ముప్పు అనే విషయాన్ని గ్రహించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్ఎస్ పై నమ్మకం లేని ప్రజలు ఎన్నికల్లో దూరం పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ మాటలు రాజకీయ విశ్లేషకులు సైతం నవ్వుకునేలా ఉన్నాయని అనుకొంటున్నారు.. ఇక పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితిపై ఓ క్లారిటీ ఉంటుందనే వాదన వినిపిస్తుంది. ఆ నలుగురు మాత్రమే మిగులుతారా? అనే అనుమానాలు సైతం కొందరు వెల్లడిస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీని కాపాడుకోవాలి కానీ నోరు జారీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే లాభం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు..

You may also like

Leave a Comment