మెగా హీరో వరుణ్‌తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) కొంతకాలం ప్రేమించుకుని కుటుంబసభ్యుల సమక్షంలో ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, కొత్త మెగా కోడలు పెళ్లి తర్వాత సినిమాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
తాజాగా తాను చేయబోతున్న కొత్త సినిమా విషయాలను లావణ్య అభిమానులతో పంచుకుంది. ఇప్పటికే పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో అలరించిన లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత తాను ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నట్లు తెలిపింది. పెళ్లి తర్వాత ఎవరికైనా కొన్ని కండీషన్స్ ఉండడం సాధారణం. అయితే, తనకు మాత్రం అలాంటి కండీషన్స్ ఏమీ లేవంటోంది ఈ మెగా కోడలు.
అంతేకాదు.. మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ పొంగిపోయింది. లావణ్య నటించిన ‘మిస్ పర్ఫెక్ట్’ సినిమా హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్.. రీసెంట్‌గా జరిగింది. అయితే ఈ లాంచ్ ఈవెంట్‌లోనే లావణ్య త్రిపాఠి.. తన వివాహ జీవితం, మెగా ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలను తెలిపింది.
ఇంతకీ ఈ మెగాకోడలు ఏమని చెప్పిందంటే.. “నాకు సినిమాలు, వెబ్ సిరీస్‌లు అని తేడా లేదు.. నచ్చిన కథలను ఎంచుకుంటూ సినిమాలు, సిరీస్‌లు చేస్తాను. ‘మిస్ పర్‌ఫెక్ట్’ వెబ్ సిరీస్ తో పాటు ఓ రెండు సినిమాల్లోనూ నటిస్తున్నా..! మెగా కోడలు అనే ట్యాగ్‌తో మరిన్ని బాధ్యతలు పెరిగాయి’’ అంటూ పొంగిపోయింది.