ఒకరు అధికారం చేయి జారిపోయిందనే బాధలో.. మరొకరు సంవత్సరాల తర్వాత అధికారం దక్కిందనే ఆలోచనలతో.. ఇలా వీరి మధ్య తెలంగాణ రాజకీయాలు హిట్ పుట్టిస్తున్నాయి.. ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) మధ్య వార్ అసెంబ్లీ సమావేశాల్లో వేసవి వేడిని మారిపించేలా సాగుతున్నాయి.. ఈ క్రమంలో నేడు అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ హరీష్ రావు కత్తులు నూరుకొన్నారని తెలుస్తోంది.
ఈ చర్చలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడుతూ.. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు కృష్ణ నీళ్లే ప్రాణ ప్రదాయిని అన్నారు. అనంతరం బీఆర్ఎస్ లోని ముఖ్య నాయకున్ని కరీంనగర్ ప్రజలు తరిమేసారని.. పాలమూరు ప్రజలు ఆదరించి ఎంపీగా గెలిపించారని గుర్తు చేశారు. అలాంటి మహానుభావుడు సభకు రాకుండా, బాధ్యత మరచి ఫామ్ హౌస్ లో ఉండటం ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదా? అంటూ సీఎం మండిపడ్డారు.
అసెంబ్లీలో జరుగుతున్న తీర్మానానికి మద్దతు చెప్పాల్సిన ప్రతిపక్ష నేత, సభకు రాకుండా ఫామ్ హౌస్ దాక్కోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ సందర్భంగా కొందరిది దొంగ బుద్ది మార్చుకోవాలని సూచించారు. దొంగలకు సద్దులు మోయడం మానుకోవాలన్నారు. కేసీఆర్ (KCR) కుర్చీ మొన్న ఖాళీగా ఉండేదని.. ఇప్పుడు ఆ సీట్లో పద్మారావు కూర్చోవడం చాలా సంతోషంగా ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యమ కారుడైన పద్మన్నకి ఆ సీటు ఇవ్వడం మంచిదన్నారు.
మరోవైపు అసెంబ్లీలో హరీష్ రావు ( Harish Rao) మాట్లాడుతూ.. రేవంత్ కూడా తెలంగాణ గురించి మాట్లాడితే.. దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని విమర్శించారు. కొడంగల్ నుంచి రేవంత్ ను తరిమితే.. మల్కాజిగిరి వచ్చి చేరాడని సెటైర్ వేశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు అవకాశం ఇవ్వండని అడిగినా.. స్పందించలేదని ఆరోపించారు. సభలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని హరీష్ రావ్ మండిపడ్డారు. నల్గొండలో సభ పెట్టినం కాబట్టి.. కాంగ్రెస్ వాళ్ళు తప్పులను తెలుసుకున్నారని తెలిపారు.