పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ (Telangana)లో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS)మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో సీపీఎం (CPM) నేతలు భేటీ కావడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ ఎన్నికల్లో మద్దతు విషయంలో వీరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా సీపీఎం నేతలతో సమావేశమైన అంశంపై రేవంత్ కీలక విషయాలు వెల్లడించారు.. భువనగిరి పార్లమెంట్ తో పాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. మరి కొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా వారి ముందుకు తీసుకొచ్చామన్నారు. బీజేపీ శక్తులను ఓడించే విషయంలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు వారు అంగీకరించారని పేర్కొన్నారు..
అదేవిధంగా దేశంలోనూ ఇండియా కూటమితో కలిసి పనిచేయనున్నారని తెలిపిన సీఎం.. ఒకట్రెండు విషయాల్లో సందిగ్దత ఉన్నా… అధిష్టానంతో చర్చించి రేపటిలోగా ఏకాభిప్రాయానికి వస్తామని తెలిపారు. ఈ రెండు పార్టీల మధ్య కుదిరిన అవగాహన రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు పనిచేస్తుందని భావిస్తున్నట్లు రేవంత్ వెల్లడించారు..