తెలంగాణ (Telangana)లో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) మధ్య పొలిటికల్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కామన్ గా అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్.. వారికి అనుకూలంగా ప్రవర్తించిందనే ఆరోపణలున్నాయి.. ప్రతిపక్షంలోకి మారాక ప్రజా సమస్యలపై కూడా వారికే అనుకూలంగా గళం విప్పుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి..

బ్యాంకుల్లో రుణాలు తీసుకోన్న రైతులు ఎవ్వరూ రూపాయి కట్టొద్దు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం. ఇవి ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చెప్పిన మాటలంటూ ట్విట్టర్ ద్వారా తెలిపిన కేటీఆర్ (KTR).. లోన్ తీసుకోనోళ్లు పోయి తెచ్చుకోండన్నారు.. కానీ నేడు.. పంట రుణాలపై కాంగ్రెస్ సర్కారు మౌనం.. రైతన్నలకు లీగల్ నోటీసులు..
ఇదా మిమ్మల్ని ఎన్నుకొన్నందుకు ప్రజలకు ఇచ్చే బహుమానం.. ఇంత మోసం, దగా, నయవంచన ఎప్పుడు చూడలేదంటూ.. కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా కేటీఆర్ ట్వీట్ పై నెటిజన్లు సైతం స్పందిస్తున్నట్లు తెలుస్తోంది.. రేవంత్ మాటలు నమ్మి బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకున్నామని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ 2 లక్షల రుణ మాఫీ ఉత్త మాటేనా? అని మరొకరు.. లోన్లు కట్టాలని రైతలకు లీగల్ నోటీసులు బ్యాంకులు పంపుతున్నాయని, ఆ రోజులే బాగుండేరా అని ఇంకో నెటిజన్ కామెంట్స్ చేస్తున్నారని అంటున్నారు