రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy)ని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పరామర్శించారు. యశోదా ఆసుపత్రి (Yashoda Hospital)లో చికిత్స పొందుతున్న మంత్రిని కలిసి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకొన్నారు.. అయితే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో వెంకటరెడ్డి గొంతు నొప్పితో కాస్త ఇబ్బంది పడ్డారు. అయినా అలాగే ప్రచారాన్ని నిర్వహించారు..
ఎన్నికలు పూర్తి కావడం, ఫలితాలు వెలువడిన తర్వాత మరోసారి గొంతు నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించారు.. ఈమేరకు హైటెక్ సిటీ, యశోద ఆస్పత్రి వైద్యులు.. రోబోటిక్ టెక్నాలజీ ద్వారా వెంకటరెడ్డికి థైమెక్టమీ (Thyomectomy) ట్రీట్మెంట్ అందించారు. కాగా వెంకట్రెడ్డి, డిసెంబర్ 13న సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే..
అదే సమయంలో అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) సైతం చికిత్స పొందుతున్నారు.. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా పలువురు కాంగ్రెస్ (Congress) నేతలు పరామర్శించారు.. కాగా మంత్రి కొంతకాలంగా గొంతు సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.
అయితే మరోసారి ఇబ్బంది రావడంతో హైటెక్ సిటీలోని, యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఇక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వెంకటరెడ్డి, నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి విజయాన్ని అందుకొన్నారు..