Telugu News » Telangana : ఆ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పతనం ఆరంభమైందా..!?

Telangana : ఆ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పతనం ఆరంభమైందా..!?

మరోవైపు స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్స్‌ (SDF) ఇవ్వాలని ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. ఎస్‌డీఎఫ్‌తో పాటు ప్రొటోకాల్‌ ఉల్లంఘన, గన్‌మెన్ల కుదింపు తదితర అంశాలను సీఎం దృష్టికి తీసికెళ్లినట్టు మీడియాకు వివరించారు.

by Venu

నిన్న సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth reddy) ఉమ్మడి మెదక్ (Medak) జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కలిసినట్టు.. వారు బీఆర్ఎస్ వీడుతున్నట్లు గుప్పుమన్న వార్తలపై నర్సాపూర్ ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి (MLA Sunithalaxamareddy) స్పందించారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు.

మెదక్‌ జిల్లా సమస్యలు వివరించేందుకే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశామని వివరణ ఇచ్చారు. తాము ఎవరితోనూ చర్చలు జరపడంలేదని, ప్రొటోకాల్, ఎస్కార్ట్ ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశామన్నారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ (BRS) అధినేత కేసీఆర్‌ (KCR) నాయకత్వంలోనే చివరి వరకు పని చేస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్స్‌ (SDF) ఇవ్వాలని ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. ఎస్‌డీఎఫ్‌తో పాటు ప్రొటోకాల్‌ ఉల్లంఘన, గన్‌మెన్ల కుదింపు తదితర అంశాలను సీఎం దృష్టికి తీసికెళ్లినట్టు మీడియాకు వివరించారు.

ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. దీంతో గులాబీ అధిష్టానం విషయాన్ని ఆరాతీయడం మొదలు పెట్టిందని సమాచారం. కాగా సీఎంను కలిసిన వారిలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గుడెం మహిపాల్‌రెడ్డి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. అయితే ఎమ్మెల్యేలు సీఎం ను కలవడంతో.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పతనం ఆరంభం అయ్యిందా? అనే అనుమానాలు లేవనెత్తుతోన్నారు..

You may also like

Leave a Comment