Telugu News » Telangana : ఎక్స్‌పైరీ తేదీ అయిపోయిన బీఆర్ఎస్.. ఓల్డ్ ప్రొడక్ట్ జాబితాలో చేరిందా..?

Telangana : ఎక్స్‌పైరీ తేదీ అయిపోయిన బీఆర్ఎస్.. ఓల్డ్ ప్రొడక్ట్ జాబితాలో చేరిందా..?

ప్రస్తుతం బీఆర్ఎస్ కూడా ఎక్స్‌పైరీ తేదీ అయిపోయిన ఓల్డ్ ప్రొడక్ట్ జాబితాలో చేరిందని అనుకొంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన అవినీతి అనేది ఫెవికాల్ గా పట్టుకొందని.. సెంటి మెంట్ తో జనాన్ని వెర్రివాళ్ళను చేసిందనేది బలంగా నమ్ముతున్నారు

by Venu
brs parliamentary party meeting tomorrow topics to be discussed are

తెలంగాణ (Telangana) రాష్ట్రానికి ఊపిరి అందించింది నేను.. ఉద్యమానికి ఆయువు నేను.. ఈ నేను అనేది చివరికి కేసీఆర్ ను ఒంటరిని చేసిందని అంటున్నారు.. ప్రస్తుత రాజకీయాల్లో బీఆర్ఎస్ అవలంభించిన విధానాలు రెండు పర్యాయాలు బాగానే ఊపునిచ్చాయి.. నేను.. నా కుటుంబం.. అనేది ఒకవైపు.. దేశరాజకీయాల్లో నేను.. రాష్ట్ర రాజకీయాల్లో కొడుకు.. కూతురు.. ఈ పోకడల వల్ల గులాబీకి తెగులుపట్టినట్లు తెలుస్తోంది. ఫలితంగా నిండు కుండలా ఉన్న పార్టీ ప్రస్తుతం ఖాళీ కుండలా మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అసెంబ్లీ ఎలాగో పరువు తీసింది. కనీసం లోక్ సభలో అయిన పరువు కాపాడుకుందామని భావించిన కేసీఆర్‌ (KCR) స్వయంగా రంగంలోకి దిగి తెలంగాణ భవన్‌లో సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నా.. నాయకులు, కార్యకర్తల్లో ధైర్యం నింపలేక పోతున్నారని అనుకొంటున్నారు. ఒకవైపు సిట్టింగ్‌ ఎంపీల్లో ఓడిపోతామనే భయం.. ఆశావహుల్లో నైరాశ్యం నెలకొన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ స్పీడ్ ఆందోళనకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి బీఆర్ఎస్‌ (BRS)లో తీవ్ర గందరగోళం నెలకొన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫలితంగా నేతలు పోటీకి నై నై అనే వరకూ వచ్చిందని తెలుస్తోంది.. మొన్నటి వరకు నల్లగొండ (Nalgonda) లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు ఉవ్విళ్లూరిన శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌ రెడ్డి ఇప్పుడు పోటీకి నో అంటున్నారని సమాచారం. అదీగాక మొహమాటం లేకుండా కేసీఆర్‌కు స్పష్టం చేసినట్టు తెలిసింది.

అదేవిధంగా చేవెళ్ల (Chevella) నుంచి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న గడ్డం రంజిత్‌రెడ్డిని బరిలోకి దించుతామని మొదట్లో పార్టీ ప్రకటించింది. కానీ మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సతీమణి, వికారాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ (Congress)లో చేరటంతో చేవెళ్లలో రాజకీయ సమీకరణాల్లో ఊహించని విధంగా మార్పులు జరిగాయి.. దీంతో చేవెళ్ల నుంచి పోటీ చేయలేనంటూ కేసీఆర్‌కు, రంజిత్‌ తెలిపినట్టు సమాచారం.

మరోవైపు పటాస్ పంచులతో మొన్నటి వరకు జోరు మీదున్న మేడ్చల్ (Medchal) ఎమ్మెల్యే మల్లన్న ఒక్క సారిగా యు టర్న్ తీసుకొన్నట్లు తెలుస్తోంది. అందువల్ల మల్కాజ్‌గిరి నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్న ఆయన కుమారుడు డాక్టర్‌ భద్రారెడ్డి ఇప్పుడు మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. దీనికి కారణం.. దుండిగల్‌లో భవనాల కూల్చివేత అని అనుకొంటున్నారు. అదేవిధంగా ఖమ్మం నుంచి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావు సైతం పోటీకి వెనుకంజ వేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

సికింద్రాబాద్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ కోసం ఎదురు చూసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ కుమారుడు, సాయికిరణ్‌ సైతం పోటీకి దూరంగా ఉంటున్నట్లు చర్చించు కొంటున్నారు.. ఈ నేపథ్యంలో అభ్యర్థుల కోసం స్వయంగా బీఆర్ఎస్ అధినేత బ్రతిమిలాడుకొనే పరిస్థితులు ఏర్పడినట్లు టాక్ వినిపిస్తోంది. అయిన ప్రతి దానికి ఒక ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది..

ప్రస్తుతం బీఆర్ఎస్ కూడా ఎక్స్‌పైరీ తేదీ అయిపోయిన ఓల్డ్ ప్రొడక్ట్ జాబితాలో చేరిందని అనుకొంటున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన అవినీతి అనేది ఫెవికాల్ గా పట్టుకొందని.. సెంటి మెంట్ తో జనాన్ని వెర్రివాళ్ళను చేసిందనేది బలంగా నమ్ముతున్నారు కాబట్టి బిగ్ బాస్ గేమ్స్ ఓవర్ అనే టాక్ వినిపిస్తోంది..

You may also like

Leave a Comment