Telugu News » David Miller: ప్రియురాలిని పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్..!

David Miller: ప్రియురాలిని పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్..!

మిల్లర్, కెమిల్లా కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ 2023 ఆగస్ట్‌లో జరిగింది. ఇన్ని రోజులకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

by Mano
David Miller: The star cricketer who married his girlfriend..!

దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్(David Miller) ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు కెమిల్లా హారిస్‌(Camilla Harris)ను ఆదివారం పెళ్లి చేసుకున్నాడు. మిల్లర్, కెమిల్లా కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ 2023 ఆగస్ట్‌లో జరిగింది. ఇన్ని రోజులకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

David Miller: The star cricketer who married his girlfriend..!

కేప్ టౌన్ వేదికగా జరిగిన డేవిడ్ మిల్లర్, కెమిల్లా హారిస్‌ల వివాహానికి పలువురు దక్షిణాఫ్రికా క్రికెటర్లు హాజరయ్యారు.  కెమిల్లా ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మిల్లర్, కెమిల్లా వివాహానికి కొద్ది మంది మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కెమిల్లా ఓ బిజినెస్ రన్ చేస్తున్నారు. త్వరలో మిల్లర్ ఐపీఎల్ 2024 కోసం భారత్ రానున్నాడు. దక్షిణాఫ్రికా జట్టులో డేవిడ్ మిల్లర్ కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

వైట్ బాల్ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా తరపున 173 వన్డేలు, 116 టీ20లు ఆడాడు. వన్డేల్లో 4458 పరుగులు, టీ20ల్లో 2270 పరుగులు చేశాడు. మొత్తంగా 8 సెంచరీలు, 30హాఫ్ సెంచరీలు మిల్లర్ బాదాడు. ఇక 121 ఐపీఎల్ మ్యాచుల్లో 2714 రన్స్ చేశాడు.

You may also like

Leave a Comment